Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 1:18 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, జల్ సంచయ్ జల్ భాగీ దారిలో రెండవ స్థానంలో నల్లగొండ

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: “జల్ సంచ య్ జల్ భాగీదారి” కార్యక్రమంలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను అభినందించా రు.సోమవారం ప్రజా వాణి కార్యక్రమం సందర్భంగా ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన వివిధ అంశాలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా “జల్ సంచాయ్ జన్ బాగిదారి” కార్యక్రమం కింద జిల్లాలో లక్ష ,5 0,0 00 పనులు నిర్వ హించాలని లక్ష్యంగా నిర్దేశించగా, లక్ష ఇరవై తొమ్మిది వేల పనులను పూర్తి చేసి రాష్ట్రంలో రెండవ స్థా నంలో నిలవడం జరిగిందని తెలిపారు. ఇందుకు కృషి చే సిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, సిబ్బంది, జిల్లా పంచాయతీ అధికా రి, ఇతర అధికారులు,మండలాల ప్ర త్యేక అధికారులను ఆయన అభినందించారు.

అన్ని పథకాల అమలలో ఇదేవి ధంగా అధికారులందరూ టీం వర్క్ చేసి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకె ళ్లాలని కోరారు. అలా గే ఈనెల 1 నుండి 5 వరకు ” స్వ చ్ఛ గావ్ సురక్ష జల్ వాయు” కా ర్యక్రమాన్ని చేపట్టడం జరుగు తున్నదని, ఈ కార్యక్రమ విజయవం థానికి జిల్లా అధికా రులందరూ సహకరించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయ న “స్వచ్ఛ గావ్ సుర క్ష జల్ వాయు”పై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా ఈ నెల 1 నుండి 12 వరకు పర్యా వరణ వారోత్స వం నిర్వహించడం జరుగుతున్నదని, ఇందులో భాగం గా జూన్ 1న పర్యావరణంపై అవ గాహన కల్పించడం , జూన్ 3న ప్ర పంచ సైకిల్ దినోత్సవం ,నాలుగున విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాల ని ర్వహణ, ఐదున పర్యావరణ దినో త్స వం, ఆరున ప్రకృతి కార్యక్రమా ల నిర్వహణ, జూన్ 8న మౌ లిక సౌకర్యాల కల్పన, 9న కమ్యూనిటీ పర్యావరణ కా ర్య క్రమాలు, 10న గ్రాస్ రూట్ పర్యావరణ కార్యక్రమాలు, 11న జూ మరియు వన్యప్రా ణులు వన దర్శిని కార్యక్రమం, 1 2న వీటన్నిటిపై సమీక్ష ఉంటుంద ని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యో గులకు సంబంధించి నూత నంగా ప్రవేశపెట్టనున్న ఆరోగ్య కార్డులు, సర్వీస్ రిజిస్టర్ల ఆ న్లైన్ అప్డేషన్ కు సంబంధించి అన్ని శాఖల అధికారులు తక్ష ణమే ఐ ఎం ఎఫ్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆదేశిం చా రు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీక రించిన ఫిర్యాదులన్నీ జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కాగా ఈ సోమవా రం రెవెన్యూ శాఖకు 43, ఇతర శాఖలకు 75 మొత్తం 118 ఫిర్యాదు లు వచ్చాయన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, జె డ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డి ఓ శేఖర్ రెడ్డి, డిఎఫ్ఓ ఎస్. రాజశే ఖర్ తదితరులు ఉన్నారు. ఈ సం దర్భంగా ప్రపంచ పర్యావరణ ది నోత్సవంపై రూపొందించిన గో డ పత్రికను, అంతేకాక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై రూపొం దించిన నూతన నియ మాల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.