Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 3:08 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క వ్యాఖ్య, మహిళలను పారిశ్రా మికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్ర భుత్వ లక్ష్యం

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మహి ళ లు డ్రోన్ సాంకేతికతను అందిపు చ్చుకు ని స్వయం ఉపాధితో ఆర్థి కంగా ఎదిగి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధ వారం టిటిడిసి లో డీఆర్‌డీఏ– సెర్ప్ ఆధ్వర్యంలో, సీఎస్‌ఆర్ నిధులతో మీరా యి శిక్షణ సంస్థ ని ర్వహిస్తున్న నీలగిరి జిల్లా మహిళా కిసా న్ డ్రోన్ ఆపరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సంద ర్శించారు. ఈ సందర్భంగా డ్రోన్ ఆపరేటర్ శిక్షణ పొందుతు న్న 50 మంది మహిళలతో ముఖా ముఖి మాట్లాడారు. మహిళలకు 10 రోజుల పాటు ఇస్తున్న డ్రోన్ శిక్షణను పూర్తి గా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒ క్కరూ నైపుణ్యం సా ధించాలని కోరారు. ఈ శిక్షణతో వ్యవసాయ రంగంలోనే కా కుండా ,వివిధ రం గాలలో ఉపాధి అవకాశాలను సృష్టించు కోవచ్చని తెలిపారు.

డ్రోన్ సేవల ద్వారా ప్రతి ఎకరాని కి సుమారు రూ.400 చొ ప్పున సే వా రుసుము లభించే అవకాశం ఉందని, జిల్లా వ్యాప్తంగా ఒకే విధమైన రేటు విధానాన్ని అమలు చేసుకుని రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. తమకు వచ్చే ఆదాయాన్ని అంచనా వేసుకుని అవసరమైన మేరకు మాత్రమే రుణాలు తీసుకోవాలని, మిగిలిన ఆదా యాన్ని పొదుపు చేసుకుంటూ ఆర్థికంగా బలపడాలని చెప్పారు.

మహిళలు ఉద్యోగాలకై ఎదురు చూడకుండా తామే డ్రోన్ యూనిట్ల యజమానులుగా మారాలని, ప్రతి గ్రూపు వద్ద ఒక డ్రోన్ యూ నిట్ ఉండేలా ప్రణాళిక రూపొం దించుకోవా లని తెలిపారు. డ్రోన్ ఆపరేట్ చేయడం మాత్రమే కా కుండా డ్రోన్ మరమ్మతు, నిర్వహ ణలో కూడా పూర్తి అవగాహన పెంచుకుని మెకానిక్‌లుగా కూడా నైపుణ్యం సంపాదించాల ని అ న్నారు. దీంతో తమ డ్రోన్లను తామే మరమ్మతు చేసు కోవడం వల్ల నిర్వహణ ఖర్చులు Olympics పాటు, ఆదా యం పెరుగుతుందని చెప్పారు.

వ్యవసాయ రంగంలో పంటలపై ఎరువులు, పురుగుమందు ల పిచికారీతో పాటు ,ఫోటోగ్రఫీ, వీడి యోగ్రఫీ, సర్వేలు, మ్యాపింగ్ త దితర రంగాల్లో కూడా డ్రోన్లకు విస్తృతంగా డి మాండ్ ఉందని తెలిపారు. అందువల్ల మహిళలు ఒకే సీజ న్‌కే పరిమితం కాకుండా ఏ డాది పొడవునా వివిధ రంగాల్లో డ్రోన్ సేవలు అందిస్తూ 360 రోజు లు ఉపాధి పొందేలా కా ర్యాచర ణ రూపొందించుకోవాలని తెలి పారు. డ్రోన్ సేవల ను పూర్తిగా క మర్షియల్ దృక్పథంతో నిర్వహి స్తూ ప్రతి అవ కాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని, రెండు పంటల సీజన్లలో వ్యవసాయ సేవలతో పాటు ,ఇతర రంగాల్లోనూ అవకాశాలను వినియో గించుకుని మంచి వ్యాపార వేత్త లు గా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ శిక్షణ మహిళల జీవితాల్లో ఆ ర్థిక స్వావలంబనకు నాం ది పలుకుతుందని, డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహి ళ లు కొత్త ఉ పాధి అవకాశాలను సృష్టించుకుని కుటుంబాల అభివృద్ధితో పా టు జిల్లా అభివృద్ధిలోనూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్ట ర్ ఆకాంక్షించారు.శిక్షణ పొందుతున్న ఆపరేటర్లు విజయలక్ష్మి మాట్లాడుతూ సొంతకాళ్ళపై ని ల బడి ఎదగడానికి , అభివృద్ధి లోకి రావడానికి సహాయ సహ కారాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, మీరాయి సీఈవో విజయ్,జిల్లా పరిశ్రమల శాఖ అధి కారి సతీష్ , జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ ,ఎపిడి శ్రవ ణ్ కుమార్, శ్రీలేఖ, శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొ న్నారు.