Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 3:38 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల కపిలుపు, చేనేత కళాకారులు ముద్ర రుణాలతో ఆర్థికంగా ఎద గాలి

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభు త్వం అందిస్తున్న ముద్ర రుణాల ను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడం తో పాటు, ఆర్థికంగా మరిం త బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలు పునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జి ల్లా చేనేత కళాకా రులకు ముద్ర రుణాలపై నిర్వ హించిన అ వగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

చేనేత రంగం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే రంగమ ని, చేనేత కళాకారుల అభివృద్ధికి ప్ర భుత్వం అన్ని విధాలు గా అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి చేనేత కార్మి కుడు ముద్ర రుణాలను వినియోగించుకుని తమ వృత్తిని విస్తరించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ము ద్ర పథకం కింద రూ.50 వే ల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నా యని, వ్యక్తిగతంగా, సం ఘాలుగా లేదా క్లస్టర్‌ల రూపంలో కూడా ఈ రుణాలను పొం దే అవకాశం ఉందన్నారు. బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూ డిన రుణ సదుపాయాలు లభిస్తాయని, అధికారులు చేనేత కళాకారులకు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు.

చేనేత కళాకారులు చేనేత భరో సా వంటి ప్రభుత్వ సంక్షేమ పథ కాలను తప్పకుండా వినియోగిం చుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల చేనేత సహకార సంఘాలకు పాల కవర్గాలు ఏర్పడిన నేపథ్యంలో, ఇకపై తరచూ చేనేత కళా కారులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను నే రుగా తెలుసుకుని పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలి పారు.ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సంద ర్భంగా జిల్లా లోని చేనేత కళాకారుల సమస్య లను ప్రత్యే కంగా పరిశీలించి, సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

చండూరు మాజీ జడ్పీటీసీ క ర్నాటి వెంకటేశం చేనేత రంగ స మస్యలపై కలెక్టర్ కు వివరించారు. సమస్యలను పరిష్క రిస్తామని కలెక్టర్ చెప్పారు.చేనేత రం గం బలోపేతానికి ప్ర భుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి కళాకారుడు స ద్వినియోగం చేసు కోవాలని ఆయన కోరారు.ఈ కా ర్యక్ర మంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డి , చేనేతశాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య , లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రామిక్ , చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం,చేనేత కళాకారులు, అధికారులు పాల్గొ న్నారు.

బిఎల్ ఓ స్థాయి సమావేశానికి బిఎల్ ఏలు విధిగా హాజ రవ్వాలి

నల్లగొండ : ఓటరు జాబితా ప్ర త్యే క సమగ్ర సవరణ(సర్) కార్యక్ర మంలో భాగంగా ఓటరు జాబి తాలో చనిపోయినా, శాశ్వతంగా చిరునామా మారిన , ఆబ్సెంటు ఓటర్ల విష యంలో ఆగస్టు 1, 2 తేదీలలో బిఎల్ ఓ స్థాయిలో నిర్వ హించే సమావేశానికి బిఎల్ ఏలు తప్పనిసరిగా హాజరయ్యే లా చూడాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చం ద్రశేఖర్ రాజకీయ పక్షాల ప్రతినిధులతో కోరారు.పోలింగ్ కేం ద్రాల హేతుబద్దీకరణపై ఆగ స్టు1న ఎ న్ని కల సంఘానికి ప్ర తిపాదనలు పంపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమంలో భాగంగా శు క్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వ హించిన అఖి లపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల హేతు బ ద్దీకరణకు ఆగస్టు1న ప్రతిపా ద నలను పంపడం జరుగు తుంద ని, ఆగస్టు 10న ముసాయిదా ఓ టరు జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. సర్ సందర్భం గా ఓటర్ల నుం డి సేకరించిన ఎ న్యూమరేషన్ ఫామ్స్ లో  తప్పులు, అలాగే చనిపోయిన, శా శ్వ తంగా చిరునామా మారిన, వివిధ కార ణాల వల్ల ఎన్యూ మరేషన్ ఫారాలు సమర్పించని ఓట ర్ల విషయంలో బిఎల్ఓ స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి జాబి తా తయారు చేసేందుకు గాను, ఈ నెల ఒకటి రెండు తేదీల లో బిఎల్ వో స్థాయిలో సమావేశం నిర్వహించడం జరుగు తుందని, ఈ సమావేశానికి బిఎల్ ఎలు తప్పనిసరిగా హాజ రు అయ్యేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కో రారు. మ రోసారి ఎన్యూమరేషన్ ఫారాలను తని ఖీ చేసి ఎక్కడైనా తప్పులు దొర్లినట్లయితే గుర్తించి బిఎ ల్ఎ ల దృష్టితీసుకువచ్చి ముసాయిదా జాబితా ప్రచురించే క న్నా ముందే వాటిని సరిచేసుకునే విధంగా చూడాలన్నా రు.

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పై జిల్లా కలెక్టర్ వివరాలు తెలి యజేస్తూ, జిల్లాలో మొత్తం 18 12 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 3 0 పోలింగ్ కేంద్రాలు లొకేషన్ మార్పుకు ప్రతిపా దనలు వచ్చాయ ని, అదే విధంగా 8 పోలింగ్ కేం ద్రాల పేరు మార్పు, 42 కొత్త పో లింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతి పాదన లు వచ్చినట్లు తెలిపారు. వీటన్నింటిపై ఆగస్టు 1న ఎన్నిక ల సంఘానికి ప్రతిపాదించను న్న ట్లు ఆయన వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఏవైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతి నిధులు వెం టనే తెలియజేయాల ని కోరారు. ముసాయిదా ఓటరు జా బితా ఆగస్టు 10 న ప్రచురించి న తర్వాత నెలరోజుల పా టు ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలను తీ సుకోవడం జ రుగుతుందని కలెక్టర్ వెల్లడించారు.

అంతకుముందు రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఆగస్టు 3 వరకు ఎన్యూ మరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి అవుతుందని, ఆగస్టు 10 ముసాయి దా ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు రెండు కిలోమీటర్ల లోపు, 12 00 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రా న్ని ఏర్పాటు చేయడం జరుగు తుందని ,ఇందులో భాగంగానే కొత్త పోలింగ్ కేంద్రాలు, పేరు మా ర్పు, ఒక చోటు నుండి మరో చో టుకు తరలించిన పో లింగ్ కేం ద్రాల జాబితాను సిద్ధం చేసి రా జకీయ పార్టీల ప్రతి నిధుల ముందు ఉంచినట్లు వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర స వరణలో భాగంగా చనిపోయిన, చిరునా మా మారిన ఓటర్ల కు మరోసారి నోటీసులు జారీ చేసి బిఎ ల్ ఓ ల ద్వారా బిఎల్ఏ సమక్షంలో జాబితా అనంతరం చ నిపోయిన, గైర్హాజరు ఓటర్ల పేర్లు తొలగించడం జరుగుతుం దని తెలిపారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడు తూ డబుల్ ఓటర్ల తొలగింపు,ఆన్లైన్ లో ఎ న్యూమరేషన్ ఫామ్స్ సమర్పించి ఏదైనా సాంకేతిక సమస్య వల్ల త ప్పు లు దొర్లినట్లయితే వాటిని స వరించుకునే అవకాశం కల్పిం చాలని, ఆబ్సెంట్ ఓటర్లను వెంటనే జాబితా నుండి తొల గిం చకుండా నోటీసులు జారీచేసి మరోసారి అ వకాశం కల్పించి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.ఇండియన్ నేషన ల్ కాంగ్రెస్ పార్టీ నుండి ముంతా జ్ అలీ, బిజెపి పార్టీ తరఫున లింగ స్వామి, బి ఆర్ ఎస్ నుండి పిచ్చయ్య, సిపిఐఎం నుండి న ర్సిరెడ్డి, టిడిపి నుండి తేలు అన్న రవి, ఏఏపీ నుండి ఎస్ కే ఆర్ అ న్సారీ, ఎన్సీపీ నుండి రఫీక్ ఏఐ ఎంఐ ఎం నుండి ఖాజా గౌస్ మొయినుద్దీన్ ,ఎన్నికల విభాగం ప ర్యవేక్షకులు కృష్ణమూర్తి డీటిలు, తదితరులు ఈ సమావేశానికి హాజర య్యారు.