Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 2:18 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ఆదేశం, సీఎం రేవంత్ వరుణ యాగానికి పగడ్బందీ ఏర్పాట్లు

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: ఈ నెల 10న నాగార్జునసాగర్ స మీపం లోని విజయ విహార్ వద్ద నిర్వహించనున్న వరుణ యా గా నికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హాజరుకాను న్నార న్న ప్రాథమిక సమాచారం మేరకు ఏ ర్పాట్ల విషయమై న ల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం నాగర్జున సా గర్ సమీపంలోని వి జయ విహార్ ను సందర్శించారు. వరు ణయాగం నిర్వహించే యా గస్థలి, ప్రవచన శాల ,యాగని ర్వహణకు అవసరమైన ఏర్పాట్ల పై దేవాదాయ , రెవెన్యూ, పోలీ సు,ఇతర సంబంధిత శాఖల అ ధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

వరుణ యాగానికి రాష్ట్ర ముఖ్య మంత్రి హాజరుకానున్న దృ ష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లను చే యాలని జిల్లా కలెక్టర్ ఆదేశించా రు. యాగశాల ఏర్పాటు చేసే ప్ర దేశం, భారీకేడిం గ్ , పగోడాల ఏ ర్పాటు, ప్రవచనశాల ,టెంట్లు, ఎ ల్ఈడిలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏ ర్పాటు వివిధ ప్రాంతాల నుండి యా గం నిర్వహించేందుకు వచ్చే ఋత్వికులు, అర్చకులకు వస తి సౌకర్యాల వంటి ఏర్పాట్లన్నీ చే యాలని చెప్పారు. అంతే కాక అ న్ని చోట్లా భారీకేడింగ్ ఏర్పాటు చేయాలని ,ప్రవచనా లు వినేందుకు బయట నుండి వచ్చే సాధారణ ప్రజలకు , యాగానికి హాజర య్యే ప్రముఖులకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు,పార్లమెంట్ స భ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతి నిధులు, అధికారులు హాజరుకానున్న దృష్ట్యా యాగశాల వద్ద యాగాన్ని తిలకించేం దుకు అవసరమయ్యే ఏర్పాట్లతో పాటు,బందోబస్తు, ఇతర ఏర్పా ట్లను చేయాలని ఆదేశించా రు. విజయవిహార్ మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావును ఆదే శించారు. అలాగే అవసరమైన చోటపగోడాల ఏర్పాటుతో పాటు, తాగునీరు, మూత్రశాలలు, ముందు రోజు నుండి యాగానికి వచ్చే ఋత్వికులు ,అర్చకులకు భోజన, వస తి సదుపాయాలు కల్పించాలన్నారు.

పోలీస్ శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ,వరుణ యా గం నిర్వహించే స్థలం మొత్తం ప్లాన్ తో సహా సమర్పించా లని అధికారులను ఆదేశించారు. అద నపు ఎస్పి రమేష్, మి ర్యాలగూడ ఆర్డీవో రమణా రెడ్డి, యా దాద్రి దేవాలయ డి ప్యూటీ ఈవో డి. భాస్కర్ జిల్లా ఎండో మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కే. భాస్కర్ ,డీఎస్పీ ర వి, ఆర్ ఐ శ్రీ నివాస రెడ్డి, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

 పారదర్శకoగా సమగ్రసవరణ ఓటరు జాబితా

నల్లగొండ: ఓటరు జాబితా ప్ర త్యే క సమగ్ర సవరణలో భా గంగా పారదర్శక ఓటరు జాబితా రూపొం దించడమే ము ఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చoద్రశేఖర్ అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజి టలై జే షన్, తదితర అంశాలపై శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

గత వారం నిర్వహించిన సమావే శంలో ఆయా పార్టీల ప్రతి నిధులు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సర్ కార్యక్రమంపై సూచించి న అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగిం దని కలెక్టర్ తెలిపారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం సవరించి న షెడ్యూల్ ను ఆయన సమావేశానికి హాజరైన పార్టీల ప్రతినిధు లకు తెలియజేశారు.సరించిన షె డ్యూల్ ప్రకారం జూన్ 25,2026 నుండి ఆగస్టు 10 వరకు బిఎల్ ఓల ఇంటింటి సందర్శన ఉంటుందని, 10న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, ఆగస్టు 17 న ముసాయిదా ఓట రు జాబితా ప్రచురణ, 17 నుండి సెప్టెంబర్ 16 వరకు నెల రోజులపాటు ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంత రాల స్వీకరణ, ఆగస్టు 17 నుండి అక్టోబర్ 15 వరకు అభ్యం తరాల పరిష్కారం ఉంటాయని, అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ ప్రజాప్రతిని ధులకు వివరించారు.

సర్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 99.95% డి జిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర న్నిక ల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల ఎడిట్ ఆప్షన్ బిఎల్ వో లకు ఇచ్చినం దున, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురి తమయ్యే నాటికి ఓటరు జాబితాలో పూర్తి స్పష్టత రా వాల ని, అర్హులైన ఏ ఒక్క ఓటరు జాబితా నుండి తొలగిపోకూడ దని, అలాగే అర్హతలేని వారు జాబితాలో ఉండరాదని చె ప్పారు. ఎన్యుమరేషన్ ఫారాల సవరణ పకడ్బందీగా నిర్వ హించాలని,ఈ విషయమై అందరికీ తెలిసేలా అ వసరమైతే మండల స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి మరోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేయాలని సూచిం చారు.

ప్రతి బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫా రాలు కరెక్షన్ చేసి ఇవ్వాల ని, నియోజకవర్గస్థాయి బూతు లెవల్ ఏజెంట్లు బిఎల్ఓ స్థా యిలో జరి గే సమావేశాలకు హాజరై ఫారాలు మరో సారి ప రిశీలించుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజే యాలని కోరారు.ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబి తా ప్రచురితం చేయనున్నందున, ఎన్యూమరేషన్ ఫారాల క రెక్షన్ మరియు డిజిటలైజేషన్ ను ఈ నెల 10లోగా పూర్తి చే యడం జరుగుతుందని తెలిపారు.

ఆయా రాజకీయ పార్టీల ప్రతి నిధులు మాట్లాడుతూ రెండు, మూడు పోలింగ్ బూతులు ఒకే చోట ఉన్నట్లయితే ఓటర్లకు దగ్గ రయ్యే లొకేషన్ లో పోలింగ్ కేం ద్రం ఏర్పాటు చేయాల ని, ఎవరైనా ఓటర్లు తప్పుడు దృవపత్రాలు సమర్పించిఓట్లు పొంద కుం డా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చనిపోయిన ఓటర్ల తొలగిం పు సందర్భంగా మరోసారి పూర్తి స్థాయిలో ప రిశీలించి తొలగించాలని, ఓటరు జాబితాలో ప్రముఖుల పే ర్లు తప్పుగా ఉన్నట్లయితే సరి చేయాలని సూచించారు. జి ల్లాలో సర్ కార్యక్రమాన్ని బిఎల్ ఓలు పారదర్శకంగా, నిర్దేశిం చిన సమయం ప్రకారం సమర్థ వంతంగా నిర్వహించడం ప ట్ల బి ఎల్ఓలను, జిల్లా యంత్రాంగా న్ని అన్ని రాజకీయ పా ర్టీల ప్రతి నిధులు అభినందించారు.

సిపిఐ ఎం నర్సిరెడ్డి,బిజెపి నుండి లింగ స్వామి టిఆర్ఎస్ నుండి పిచ్చ య్య,కాంగ్రెస్ పార్టీ నుండి ముం తాజ్ అలీ, ఎ న్సీపీ నుండి రఫీక్ , ఏఐఎంఐఎం నుండి ఖా జా గౌస్ మొ హియుద్దీన్, బిఎస్పీ నుండి రవిశంకర్, టిడిపి నుండి రవి త దితరులు మాట్లాడారు. ఆర్డీవోలు వై.అశోక్ రెడ్డి, శ్రీదేవి పద్మ ప్రియలు వారి డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు సర్ డి జిటలైజేషన్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ స మాచారాన్ని తెలియజేశారు.జిల్లా రెవెన్యూ అధికారి దశర థ్, ఎన్ని కల విభాగం పర్యవేక్షకులు కృష్ణ మూర్తి, ఏఈ ఆర్ వోలు, తహసి ల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.