Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీల క ప్రకటన, సెప్టెంబర్ 1 నుండి క లెక్టరేట్ లోని ఉద్యోగులoదరికి ముఖగుర్తింపు ద్వారా హాజరు

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అన్ని శాఖల అ ధికారులు, ఉద్యోగులు ఇకపై ము ఖగుర్తింపు యాప్ ద్వారా హా జరు ఇవ్వాల్సి ఉంటుంద ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.వనమహోత్సవం కింద ఈ నెల 2 5 న జిల్లా వ్యాప్తంగా సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు. ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా సోమవారం అ యన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వ ద్ద నుండి ఫిర్యాదులు తీసుకున్న అనంతరం జిల్లా అధికారు లతో మాట్లాడుతూ సమయపాలన, పారదర్శకత బాధ్యత ను పెంపొందించడంలో భాగంగా అధి కారులు, ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండేలా సెప్టెం బర్ 1 నుండి కలెక్ట ర్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్ని కార్యాల యాలలో అధికారి మొదలు కొ ని వాచ్ మెన్ వరకు ముఖ గు ర్తింపు హాజరుఅమలు చేస్తున్న ట్లు చెప్పారు. అందువలన అన్ని శాఖల ఉద్యోగులందరు ఈ యా ప్ లో నమోదు కావాలని, ఇకపై ఈఆప్ ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులను పాస్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25న జిల్లా వ్యాప్తంగా అ న్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాల యాల్లో వనమహోత్సవం కింద సామూహికంగా మొక్కలు నాటా లని ఆదేశించారు. అటవీ, గ్రామీ ణాభివృద్ధి, స్థానిక సంస్థల ఆధ్వ ర్యంలో ఈ బాధ్యతను చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వి జయవంతం చేయాలన్నారు. జి ల్లాలో ఇప్పటివరకు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని, ఈ సంవత్సరం వనమహోత్సవం కింద జిల్లాలో 57 లక్షల 70 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. మొ క్కలు నాటే కార్యక్రమంలో ప్ర జా ప్రతినిధులను భాగస్వామ్యం చే యాలని, ఉదయం 10 నుంచి 1 1 గంటల లోగా ఈ కార్యక్రమం చేపట్టాలని, మండలాల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటే కా ర్యక్రమంలో పాల్గొనాలని చెప్పా రు.
ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా గుడిసెల స్థానంలో ఇం డ్లకు గుర్తించిన అర్హులైన లబ్ధిదా రుల వివరాలను వారంలో మం జూరు ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో సమ న్వయం చేసుకొని ప్రతిపాదనలు తెప్పించాలని స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డిని ఆదేశించారు.ఇకపై అ న్ని శాఖలు టి- ఫైబర్ నెట్వర్క్ ను ఉపయోగించాలని కలెక్టర్ అన్నారు . ఈ నెల 30న నిర్వ హించనున్న నీట్ పరీక్షను ఎలాం టి తప్పిదాలకు అవకాశం ఇవ్వ కుండా పకడ్బందీగా నిర్వహించా లని చెప్పారు. ఆర్ సిఓలు, జిల్లా కోఆర్డినేటర్లు అన్ని హాస్టల్లో ఖా ళీలన్నింటిని భర్తీ చేయాలన్నా రు. జిల్లా అధికారులందరూ ప్ర తి నెల 5 లోగా టూర్ డైరీలు స మర్పించాలని ఆదేశించారు.
పత్రి కల్లో వచ్చే వ్యతిరేక వార్త లకు ఎ ప్పటికప్పుడు స్పందించి వివరణ పంపించాలన్నారు. జి ల్లా అధికా రులు వారి పరిధిలోని హాస్టళ్లను తనిఖీ చేయాలని, మండల ప్రత్యేక అధికారి, తహ సిల్దార్, ఎంపీడీవోలు హాస్టల్లలో విద్య, భోజ నం, పరిశుభ్రత పై నివేదిక సమర్పించాలని ఆదేశిం చారు. వివిధ స్థాయిలలో వచ్చిన ప్రజావాణి దరఖాస్తులు సాధ్యమై నంత త్వరగా పరిష్కరించాల న్నారు. జిల్లా లో సీఎం ప్రజావా ణి 28, మండల స్థాయిలో 190 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా యని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహా య కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 5 8, ఇతర శాఖలకు 58, మొత్తం 116 ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ నెల 25 నుండి సామూహి కంగా మొక్కలు నాటే కార్యక్ర మం చేపట్టాలి
నల్లగొండ: వనమహోత్సవం కా ర్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుండి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి నాటి న ప్రతి మొక్క బతికేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సో మవారం హైదరాబాద్ నుండి రా ష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వనమహో త్సవం పై జిల్లా కలెక్టర్లు, అట వీ ,దేవాదాయ శాఖ అధికారు ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మా ట్లాడుతూ జిల్లాలో మాస్ ప్లాం టేషన్ కార్యక్రమాన్ని పక డ్బందీగా చేపట్టాలని , మున్సిపాలిటీలు, గ్రామపంచాయ తీల పరిధి లోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల ను వార్డులు , గ్రామాల వారీగా నాటేలా కార్యాచరణ రూ పొందించాలన్నారు.మొక్కలు నాటడంతో పాటు, వా టిని సంరక్షించడం అత్యంత ము ఖ్యమని, నాటిన ప్రతి మొక్క బ తికేలా అధికారులు ప్రత్యేక బా ధ్యత తీసుకోవాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వ ర్షాలు కురిసే అవకా శాలు ఉన్నందున మొక్కలు నా టేందు కు ఉన్న అనుకూల పరి స్థితులను సద్వినియోగం చే సు కోవాలని సూచించారు.
ఇందులో భాగంగా వన మహో త్సవం కింద ఈనెల 25 నుం డి ప్రారంభం కానున్న మాస్ ప్లాం టేషన్ కార్యక్రమాన్ని చేప ట్టి సె ప్టెంబర్ చివరి నాటికి పూర్తి చే యాలని, వన మహో త్సవం ద్వా రా అటవీ కవరేజీని మరింత పెం చేలా చర్యలు చేపట్టాలని, ప్రభు త్వ కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రాంతా ల్లో విస్తృతంగా మొక్కలు నాటాల ని, మొక్కలు నాటే కార్య క్రమంలో ప్రజాప్రతినిధులను , మహిళా సంఘాలు, మున్సి పల్ చైర్మ న్లు తదితరులను కార్యక్రమంలో భాగస్వాము లను చేయాలని చెప్పారు.
నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి టీజీ ఫారెస్ట్ పో ర్ట ల్‌లో వివరాలను అప్‌లోడ్ చే యాలని, పట్టణ ప్రాంతాల్లో అట వీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందు న అక్కడ ఎక్కువగా మొక్కలు నాటాలని, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతా ల్లో విస్తృ తం గా పచ్చదనం పెంచాలని, ప్ర తి ఇంటికి రెండు మొక్కలు అం దించేలా చర్యలు చేపట్టడంతో పాటు, దేవాల యాల్లో ప్రత్యేక మైన మొక్కలు నాటాలని అన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కుస్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలె క్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.







