Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో న మో దు కావాలన్నదే ఎన్నికల సం ఘం ఉద్దేశమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర ఎన్ని కల సంఘం త్వరలో చేపట్టనున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమానికి గుర్తింపు పొందిన అ న్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆపిల్ చేశా రు. బుధవారం తన చాంబర్లో ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై గుర్తింపు పొందిన జాతీ య, రాష్ట్ర రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఓటరు జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ ను జారీ చేయనున్న ద ని, ఇందులో భాగం గా గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీలు పోలింగ్ బూత్ వారిగా ఏజెం ట్లను నియమించాలని కోరా రు. 2002 లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహిం చడం జరిగిం దని, 25 సంవత్సరాల తర్వాత తిరిగి నిర్వహి స్తున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు సహకరించాలని కో రారు. ఇందులో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎ స్ ఐఆర్ లో మ్యాపింగ్ కానీ వారిని తప్పనిసరిగా మ్యా పిం గ్ చేసుకోమని చెప్పాలన్నారు.ప్రత్యేక సమగ్ర సవరణ భా గంగా ఓటర్ గా నమోదయ్యేందుకు ఉన్న అర్హతలు తెలి యజేస్తూ భారత పౌరుడై ఉండి ,18 సంవత్సరాలు పూర్తి చేసి, సంబంధిత నియోజకవర్గంలో నివాసి అయి ఉండాల ని తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమా న్ని సవ్యంగా నిర్వహిం చేందుకు గాను అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈఆర్వో లు, మండల స్థాయిలో ఏఈఆర్ఓ, సూపర్వైజర్లు, బూత్ స్థా యి అధికారులు ఉంటారని కలె క్టర్ వెల్లడించారు. దీన్ని దృ ష్టి లో ఉంచుకొని అన్ని రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏ జెంట్లను నియమించాలని కోరారు. ఏజెంట్లు పార దర్శ కం గా ఉండాలని, వీరి ద్వారా ఓటర్లకు ముఖ్యంగా మ్యాపింగ్ కాని వారికి మ్యాపింగ్ చేసేలా అవగాహన కల్పించాలని, ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ గురించి అందరికి తెలియ జేయాలని ఎన్యుమరేషన్ కానీ వారు తప్పనిసరిగా ఎ న్యు మరేషన్ చేయించుకునేలా చూడాలన్నారు.
జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక స మగ్ర సవరణ కార్యక్రమంలో భా గంగా ఓటర్లు మ్యాపింగ్ కాని వా రందరూ మ్యాపింగ్ అయ్యేలా అవ గాహన కల్పించాలని, ఎన్యుమరే షన్ విషయంలో బిఎల్ఎ లను ని యమించడంతో పాటు, బిఎల్వో లు ఇంటింటికి వ చ్చినప్పుడు సహ కరించాలని, ఎన్యుమరేషన్ దర ఖాస్తు లను అందరు ఓటర్లకు ఇ ప్పించేలా చూడాల్సిన బాధ్యత బి ఎల్ఏ, బిఎల్ ఓ లపై ఉందని ఆ యన చెప్పారు. ప్రత్యేక సమగ్ర స వరణ కార్యక్రమంలో భాగంగా బిఎల్ ఓలు గృహా లను సందర్శించడం జరుగుతుందని ఇంకా మ్యా పింగ్ కానీ వారు మ్యాపింగ్ చేయించుకోవాలని, ఎన్యుమరేషన్ కై ఎ న్నికల సంఘం సూచించిన 12 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఆధారం గా చూపించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించా రు.
స్థానిక సంస్థల ఇంచార్జీ అదనపు కలెక్టర్, నల్గొండ ఆర్ డి ఓ వై. అ శోక్ రెడ్డి, ఇండియ న్ నేషనల్ కాంగ్రెస్ నుండి ముం తాజ్ అలీ, బిజెపి నుండి లింగస్వామి, టిడిపి నుండి రఫీ, ఏఏపి నుం డి అద్దంకి రవి, సిపిఐఎం నుండి నర్సిరెడ్డి, బిఎ స్ పి నుండి యాదగిరి, బిఆర్ఎస్ నుండి పిచ్చయ్య, ఎన్సీ పీ నుండి రఫీ, ఎంఐఎం నుండి బషీరుద్దీన్ తది తరులు ఈ సమావే శానికి హాజరయ్యారు.
