Praja Deveena
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 1:19 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఉగాది రోజు ఇందిరమ్మ గృహప్రవేశాలు, పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవె న, చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఉగాది పండుగ రోజున రా ష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల గృ హప్ర వేశాలు లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరి గాయి. పరాభవనామ ఉగాది పర్వదినాన నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశే ఖర్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరే శంల సమక్షంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేశారు. గురు వారం నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం, గుండ్రం పల్లి, పెదకాపర్తి గ్రామాలలో పరాభవ నామ సంవత్సర ఉగా ది పర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ శా సనసభ్యు లు వేముల వీరేశంతో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇందిర మ్మ గృహా లబ్ధిదారులతో ఆనందోత్సాహాల మధ్య నూతన గృహప్రవేశాలు చేయించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ అ ర్హులైన పేద లందరికీ ఇందిరమ్మ ఇంటి ద్వారా గృహవసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా అమ లు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహా ప్రవేశాలు నిర్వ హించాలని లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు తెలి పా రు. అందులో భాగంగా ఉగాది రోజు నుండి వచ్చే రెండు, మూడు రోజుల్లో 2281 గృహప్రవే శాలు నిర్వహించేలా ప్ర ణాళిక రూ పొందించామని కలెక్టర్ తెలిపారు.నకిరేకల్ ని యోజకవర్గంలోనే 348 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఇందుకు అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చే స్తున్నారని చె ప్పారు. ప్రభుత్వం ఇ చ్చిన 5 లక్షల రూపాయలు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇంటి ద్వారా వారి కల సాకారం చేసు కోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నద న్నారు. ఎమ్మెల్యే సహ కారంతో మి గిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తా మని తెలిపారు.

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్య క్రమంలో పేదలకు నిర్మించిన ఇంది రమ్మ ఇండ్ల గృహప్రవేశాలను చే యించివా రి ఇంటి కలను నిజం చే యడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ గృహాల ని ర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తె లిపారు.నకిరేకల్ నియోజకవర్గా నికి తొలివిడతన 3,500 ఇండ్లు మంజూరు కాగా, అందులో 300కి పైగా ఇళ్లను ఇప్పటికే ప్రారంభించా మని తెలిపారు.

గుండ్రంపల్లి, పెదకాపర్తి గ్రామాల్లో సామూహిక గృహప్రవేశా లు నిర్వ హించడం ఆనందదాయకమని,రాష్ట్రంలో తొలి వి డత నాలుగు ల క్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూ రు చేసిందని, త్వరలో రెం డో విడత ద్వారా అర్హులైన ప్రతి పే ద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ని యోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా కలెక్టర్ సహకారంతో అర్హులైన లబ్ధిదారుల కు అందజేస్తామని తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో ఇ ల్లు లేని ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ ల క్ష్యమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తమకు అందించిన ఇం దిరమ్మ ఇళ్లతో తమ సొం త ఇంటి కలనెరవేరిందని లబ్ధిదారులు ఆ నందం వ్యక్తం చే శారు. ఈ సంద ర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లకు కృతజ్ఞ తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, గృ హ నిర్మా ణ పీడీ రాజ్ కుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసిల్దార్ విజయ ,ఎంపీడీవో ఎస్పీ జయ లక్ష్మి, హౌసింగ్ డిఇ అబ్దుల్ వాజిద్ ,హౌసింగ్ ఏఈ ప్రీ తి ,స ర్పంచ్ కాటo వెంకటేశం, కా ర్యదర్శి గౌతం రెడ్డి, అధికారు లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.