Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఉచిత బస్సు పథకం మ హిళ ల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు భరోసా, బల మైన అడుగు అని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ అన్నా రు.మంగళవారం నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ లో మహాలక్ష్మి ప థకంలో భాగంగా ఉచిత బస్సులో పదివేల కోట్ల ఆదాచేసిన సందర్భంగా ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన స న్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
జిల్లాలో మహిళలకు అమలు చే స్తున్న ఉచిత బస్సు పథ కం వల్ల భారీ స్థాయిలో ఆర్థిక ఆదా జరిగిం దని తెలిపారు. 2023 డిసెంబర్ లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, మహి ళ లు, విద్యార్థులు కలిసి సుమారు రూ.10 వేల కోట్ల మేర ఆ దా చేసుకున్నారని తెలిపారు. జిల్లాస్థాయిలోనే సుమారు రూ.340 కోట్ల వరకు ఆదాజరగడం విశేషమన్నారు.
ఈ పథకం వల్ల మహిళలు తమ రో జువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుని ఆ డబ్బును కుటుంబ అ వసరాలు, విద్య, ఆరోగ్యంపై విని యోగిస్తున్నారని కలెక్టర్ వివరించా రు. ఉచిత బస్సు సదుపాయం మ హిళల ఆర్థిక భద్రతకు పునాది వే స్తోందని చెప్పారు.ప్రభుత్వం మహి ళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథ కాలు అమలు చేస్తోందని తెలిపా రు.
ఇందిరామహిళా శక్తి పథకం ద్వా రా మహిళలకు వ్యాపార అవ కా శాలు కల్పిస్తున్నామని,బ్యాంకు రు ణాల ద్వారా ఆ ర్థికంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు.అదే విధం గా ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మ హిళలకు విద్యా శిక్షణ అం దించి పరీక్షలు నిర్వహించామని, మహిళ ల్లో చదువు పట్ల చైతన్యం పెరుగుతుండటం ఆనందకరమని పేర్కొన్నారు.
ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పిల్లల కు పౌష్టికాహారం అంది స్తున్నామని, మహిళా రైతులకు రైతు బీమా, పింఛన్లు వంటి ఆర్థిక భరోసా కల్పి స్తున్నామని చెప్పారు. త్వరలో అ మలు కానున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని కూడా సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి ఇం టికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లా మంత్రి చొరవతో ప్రజాప్రతినిధులందరూ కలిసి జిల్లా అభివృ ద్ధి కోసం కృషి చేస్తున్నా మ ని కలెక్టర్ స్పష్టం చేశారు.
నల్లగొండ నగర మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు బస్సుల్లో ప్రయాణించి సుమారు రూ.10 వేల కోట్ల ఆదా సాధిం చార ని చెప్పారు. ఈ పథకం వల్ల మహిళలు నెలకు సగటున రూ.5, 000 వరకు ఆదా చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీ సదుపా యా ల మెరుగుదల కోసం మంత్రి అవ సర మైన ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. అనంతరం మహాలక్ష్మి ఉచితబస్సులో ప్రతిరో జు ప్రయాణించే నలుగురు మహిళలను జిల్లా కలెక్టర్ సన్మా నించారు.
ఈ సందర్భంగా ప్రయాణికురాలు కల్పన మాట్లాడుతూ ఉచి త బస్సు పథకం మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌర వమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుప త్రులు, ఉద్యోగాలు, చిన్న వ్యాపారాల కోసం ప్రయాణించే మహిళల కు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంద ని తెలిపారు. బస్సు చా ర్జీల ఆదాకుటుంబ అవసరాలకు ఉపయోగ పడుతుందని, ఈ పథకం కుటుం బాభివృద్ధికి దోహదం చేస్తోందని పేర్కొ న్నారు.
ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శే ఖర్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణ వేణి, సిడిపిఓ హ రి త, మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కూరి రమేష్, డిపో మేనేజర్ ర మ ణ హుస్సేన్, మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, ప్రయాణికులు పా ల్గొన్నారు.

