Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలకఆదేశం, భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, న ల్లగొండ: రాష్ట్ర ప్ర భుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలు వ ల నవీకరణను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఈ ప్ర క్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవా రం ఉదయాదిత్య భవనంలో సబ్ రిస్టా ర్లు, తహసిల్దార్ లు, ఎంపీడీవోలతో భూముల మార్కెట్ వి లువలపై సమీక్ష నిర్వహించారు.జీవో నెం.41 ప్రకారం భూ ముల మార్కెట్ విలువల (మార్కెట్ వాల్యూ) నవీకరణ చే పట్టినట్లు కలెక్టర్ తెలి పారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గద ర్శ కాల ప్రకారం అర్బన్, రూరల్ కే టగిరీలుగా విభజించి ప్రక్రి య చేప ట్టాలన్నారు.

ఇందుకు సంబంధించి 1, 2, 3, 4 ఫారమ్‌ల ఆధారంగా ప్రాం తాల వారీగా రహదారులు, మండల కేంద్రాలు, నియోజ క వర్గ పరిధులు తది తర అంశాలను పరిగణనలోకి తీ సుకొ ని భూముల విలువలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ విలువలను పరిశీలించి ఆర్డీవో స్థాయిలో అప్లోడ్ చే స్తున్నామని, అనంతరం మార్కెట్ విలువలను ఫైనల్ చేసి కమిటీ ఆమోదానికి పంపనున్నట్లు తెలిపారు. అర్బన్ కమి టీలో అదనపు కలెక్టర్ చైర్మన్‌ గా ఉండగా మున్సిపల్ కమి షనర్, జెడ్పీసీఈ ఓ, సబ్-రిజిస్ట్రార్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. రూరల్ కమిటీలో ఆర్డీవో చైర్మన్‌గా, సబ్-రిజిస్ట్రా ర్, తహసీల్దార్, ఎంపీడీవో సభ్యులుగా వ్యవహరిస్తారని వివ రించారు. నాన్-అగ్రికల్చర్ ఫిజికల్ కమీటీలలో ఫారమ్-1, 2 లను, అగ్రిక ల్చర్ కమిటీలలో ఫార మ్-3, 4లను పూర్తి చే యాల్సి ఉంటుందని తెలిపారు.

 

స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల చ ట్టం ప్రకారం అన్ని వివ రాలను సరి చూసుకుని నమోదు చేయాలని సూచించారు. అగ్రికల్చర్ భూము లకు కనీస మార్కెట్ విలువ రూ.2 .75 లక్షలు, మున్సిపల్ కార్పొరే ష న్ పరిధిలో రూ.5 లక్షలు, హె చ్‌ ఎం డీఏ పరిధి లో రూ.10 లక్షలు ఉం డాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు జి ల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావే శంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, చండూర్ ఆర్డీవో శ్రీదేవి, మిర్యాలగూడ ఆర్డి ఓ రమణారెడ్డి, దే వరకొండ ఆర్డిఓ ప్రియదర్శిని, సబ్ రిజి స్ట్రార్లు, తహసిల్దార్లు, ఎంపీడీ వోలు తదితరులు పాల్గొన్నా రు.

 

ప్రతిమహిళకు, చిన్నారులకు పోషకాహారకై చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోష కాహారం అర్హులైన ప్రతి మహిళకు, చిన్నారులకు చేరేలా చర్యలు తీసు కోవాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశే ఖర్ అన్నారు. మహిళలు, గర్భిణీ లు మరియు చిన్నారుల ఆరోగ్య ప రిరక్షణలో పౌష్టికాహారం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి కుటుంబం ఆ రోగ్యకరమైన ఆహార అలవాట్లు అ లవరుచుకోవాలని సూచించారు. ప్ర జా పాలన- ప్రగతి ప్రణాళికలో 99 రోజుల కార్యక్రమంలో భా గంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాన్ని పురస్కరిం చు కొని సోమవారం ఆయన కలెక్టరేట్ ప్రాంగణంలో మ హి ళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టా ల్స్‌ను ప్రారంభించారు.

స్టాల్స్‌లో ప్రదర్శించిన అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి న పోషకా హార పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు. అంగన్‌ వాడీ కేంద్రాల ద్వా ర చిన్నారులు, గర్భిణీలు, బాలిం తలకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులను అడిగి తెలుసుకు న్నారు. అదేవిధంగా గ్రీవెన్స్ డే సం దర్భంగా కలెక్టరేట్‌కు వ చ్చిన ఒక బాలింత మహిళకు కలెక్టర్ స్వ యంగా రాగిజావ అందించారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ తీసు కుంటోందని తెలిపారు. మహిళా సం క్షేమం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో అవగాహ న పెంపొందించేందుకు మహిళా వా రోత్సవాలు దోహదపడ తాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో స్థానికంగా లభ్య మయ్యే తక్కువ ఖర్చుతో కూడిన పౌష్టికాహార పదార్థాలు, మిల్లెట్స్ ఆధారిత ఆహార పదార్థాలు మరి యు పోషకాహార వంటకాలు ప్రద ర్శించబ డినవి. ఈ సందర్భంగా అ న్ని గ్రామాలలో మండల స్థాయి లో తల్లులు, తండ్రులు, అంగన్‌వాడీ టీచర్లు మరియు హె ల్పర్లతో పౌష్టి కాహార వంటకాల పోటీలు నిర్వ హించారు. గర్భిణీలు మరియు బా లింతలకు గర్భధారణ సమయం లో తీసుకోవలసిన పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, సమ తుల్య ఆహారం, ఆహార వైవిధ్యం మరి యు జంక్ ఫుడ్ వల్ల కలిగే దుష్ప్ర భావాలపై అవగాహన కల్పించా రు. ఆరోగ్య శాఖ సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు అనీమియా పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమంలో భా గంగా ఆరోగ్య కరమైన ఆహారపు అలవాట్లపై కమ్యూనిటీ న్యూట్రిష న్ ప్రతిజ్ఞ ని ర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ , సిపిడిఓలు లావణ్య, ని ర్మల, మమత, శ్రీదేవి సూపర్వైజ ర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నా రు.

 

 ప్రజావాణి ఫిర్యాదులు వెను వెంటనే పరిష్కరించాలి

 

నల్లగొండ: ప్రజావాణి ఫిర్యాదుల ను జాప్యం లేకుండా ప రి ష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అ ధికారులను ఆ దేశించారు. జూన్ 2 న నిర్వహించనున్న రాష్ట్ర అవతర ణ దినోత్సవ వేడుకలకు అవసర మైన అన్ని ఏర్పాట్లను చే యాలని చెప్పారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం కలె క్టర్ కార్యాలయ స మావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఎ ప్పటిలాగే ఆయన సమీక్షిస్తూ ప్రజా వాణి ఫిర్యాదులు జా ప్యం లేకుం డా పరిష్కరించాలన్నారు. అలాగే డివిజన్ స్థా యిలో నిర్వహించే ప్ర జావాణి పకడ్బందీగా నిర్వహించి ప్రజ ల సమస్యలను పరిష్కరించా లని, ఎక్కడి సమస్యలు అ క్కడే పరిష్కరిస్తే ప్రజలకు సులభంగా ఉం టుంది, ప్రయాస తగ్గుతుందన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులతో పాటు, సీ ఎం కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులు, ఇతర ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించి అధికా రులు పరిష్కారం చేయాలన్నారు. జూన్ 2న నిర్వహించనున్న వేడు కల ఏర్పాట్లపై సమీక్షిస్తూ జూన్ 2 కు అవసరమైన ఏర్పాట్లు ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. స్టే జ్ ,డయాస్ ,టెంట్,తాగునీరు, ఇతర అవసర మైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ సంవత్సరం ఎండ లు ఎక్కువగా ఉన్నందున సా లధ్యమైనంత త్వరగా కార్య క్రమాన్ని ముగించే ఏర్పాటు చేయాలని చెప్పారు. జూన్ 2 నాటి ముఖ్య అ తిథి సందేశానికి అవసరమైన ని వేదికలను ఆయా శాఖలు తక్షణమే సిపిఒకు సమర్పించాలని చె ప్పా రు.

ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన సీ టింగ్ ఏర్పాటు చేయాల ని, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వ హించే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా శక టాల ఏర్పాటు, స్టాల్సు నిర్వ హణ చేపట్టాలన్నారు. అలాగే స్టా ల్స్ లో ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళిక సందర్భంగా నిర్వ హించిన కా ర్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా కని పించే వి ధం గా ప్రదర్శించాలని చె ప్పారు. ప్రజాపాలన -ప్రగతి ప్రణా ళిక లో భాగంగా సోమవారం. నుం డి నిర్వహించనున్న మహి ళా శిశు సంక్షేమ వారోత్సవాలను విజవం తంగా నిర్వహిం చాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల ను భాగస్వామ్యం చేసి విజయవం తం చేయాలని చెప్పారు. జూన్1న నిర్వహించే సామూహిక గృహప్రవే శాలకు అవసరమైన ఏర్పాటు చే యాలని తెలిపారు. రాష్ట్ర అవత రణ దినో త్సవ వేడుకల కు అందరు జిల్లా అధికారులు వారి సి బ్బం దితో సహా హా జరు కావాలన్నారు.

 

ఈ సోమవారం రెవెన్యూ శాఖకు 46 ఫిర్యాదులు, ఇతర శాఖలకు 57 ఫిర్యాదులు ,మొత్తం 103 దర ఖాస్తులు ప్రజావాణిలో ప్రజలు స మర్పించారు. ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ యూనిక్ డిజెబిలిటీ ఐ డిపై రూపొందించిన కర పత్రాన్ని ఆవిష్కరించారు.రెవెన్యూ అదన పు క లెక్టర్ జె.శ్రీనివాస్, డిఆర్డిఓ శే ఖర్ రెడ్డి, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజ కుమార్, సిపిఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుం డి ఫిర్యాదులు స్వీకరించారు.

Related Articles

Back to top button