Praja Deveena
Newspaper Banner
Date of Publish : 23 February 2026, 7:32 am Posted by : praja deveena

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, ప్రైవేట్ పాఠశాలకు మిoచి ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యనoదించాలి 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవె న, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలల ద్వారా ప్రయివేట్ పాఠ శాల లకు మించి విద్యను అందిం చాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అప్పీల్ చేశారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బొ ట్టుగూడ కోమటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రా థ మిక,ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలోని కో మటిరెడ్డి ప్రతిక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను త నిఖీ చేసిన ఆయన 9వ తరగతి విద్యార్థులకు గణితం బో ధించారు.

పాఠశాల నిర్వహణ, బోధన విధానాన్ని పరిశీలించారు. ఈ సంద ర్భంగా 9వ తరగతి గణితం తరగ తిలోకి వెళ్లి విద్యా ర్థులతో చర్చిస్తూ స్వయంగా గణిత పాఠాలను బోధించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని తె లుసుకున్నారు.సబ్జెక్టుపై పట్టు పెం చుకోవాలని, ప్రతిరోజూ ప్రాక్టీస్ చే యాలని, లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలని విద్యా ర్థులకు సూచించారు.

గణితంలో తడబాటుకు గురవుతు న్న అంశాలను సుల భంగా అర్థమ య్యే విధంగా విద్యార్థులకు వివరించి వి ద్యా ర్థులలో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాలలో తాగునీరు, మ రుగుదొడ్లు, క్లాస్ రూమ్స్ పరిస్థి తి, ఫర్నిచర్, విద్యుత్ తది తర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదు పా యాలు నిరంతరం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పా ఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా అభివృద్ధి చే యడం ప్రభుత్వలక్ష్యమని అన్నారు. డిఈఓ భిక్షపతి, పా ఠ శాల ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ వెంట ఉన్నారు.