Nalgonda Collector Chandrashekar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అ ప్పీల్, రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

:Nalgonda Collector Chandrashekar : ప్రజా దీవెన, నిడమానూరు: ఎల్ నినో కారణంగా జిల్లాలో 40 శాతం త క్కువ వర్షపాతం నమోదైన దృష్ట్యా రైతులు ఈ వ్యవసాయ సీజన్ లో కంది, పెసర, , సజ్జలు, జొన్నలు వంటి ఆరుతడి పంటలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ విజ్ఞప్తి చే శారు. ఆరు తడి పంటలకు తక్కువ నీరు అవసరమవు తుందని, దీంతో రైతులకు మేలు కలుగుతుందని, మంచి ఆ దాయం వస్తోందని చెప్పారు. అందువల్ల జిల్లాలోని రై తు లందరూ ఈ వ్యవసాయ సీజ న్లో అరుతడి పంటలు, కూ ర గాయల పంటల సాగుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గురు వా రం ఆయన నిడమనూరు మండలం, బంకాపురం గ్రా మం లో కంది పంట సాగు చేసిన రైతుల వ్యవసాయ క్షేత్రాల ను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా కంది పంటసాగు వివరాలను రైతులతో అ డిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో కంది సాగు చేశారని ? పంట వ యస్సు ఎంత అని? నల్లరేగడి భూమిలో పంట పరిస్థితి ఎలా ఉందని? ప్రశ్నించారు. దీనికి రైతులు సమా ధానమిస్తూ రెండు నెలల క్రితం 15 ఎకరాల్లో కంది సాగు చేశామని తెలిపారు. అనం తరం జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో సాధారణం వర్ష పాతం కం టే 40 శాతం తక్కువగా నమో దైందని, ప్రస్తుతం నాగార్జు నసా గర్‌లో డెడ్ స్టోరేజ్ మాత్రమే ఉ న్నందున నీటి లభ్యతను దృష్టి లో ఉంచుకుని రైతులు తప్పనిసరిగా ఆరు తడి పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఆరుతడి పంటలు 90 రోజుల వ్యవధిలో చేతికి వస్తాయని, త క్కువ నీటితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉం టుందని అన్నారు.ఒక వేళ భవిష్యత్తులో నీటి లభ్యత మె రుగుపడితే పరిస్థి తులకు అనుగుణంగా ఇతర పంటల సా గును ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. ప్రభు త్వం వివిధ రకాల పంటలకు క నీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇ స్తున్నది, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కంది, పెసర వంటి పంటల ను ఎక్కు వగా సాగు చేస్తే రైతులకు మంచి ఆదా యం లభిస్తుందని అన్నా రు. అలాగే పండ్ల తోటలు, కూర గాయల సాగుపై కూడా రైతులు దృష్టి సారించాలని కోరారు. పంటల్లో కలుపు మొక్కలు పెరిగిన వెంటనే శాస్త్రీయ పద్ధతు విల్లో కలుపు నివారణ చర్యలు చేపట్టాలని, వ్యవసాయ అ ధికారులు అవసరైతే రైతులకు ప్రత్యే క అవగాహన సద స్సులు నిర్వ హించి కలుపు నివారణ, పంటల నిర్వహణపై విస్తృత అవగాహ న కల్పించాలని ఆదేశించారు. రై తులతో మాట్లాడిన సందర్భంగా యాప్ వినియోగంపై ఎలాంటి ఇ బ్బం mదులు లేవని రైతులు కలెక్టర్‌కు తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఆరుతడి పంటలు సాగు చేస్తామ ని చెప్పారు.ఆరుతడి పంటలకు సంబంధించి జిల్లా లో అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారు లు ప్రతిరోజూ సమీక్షించి నివేదిక సమర్పిం చాలని, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు ఎ లాంటి కొరత లేకుండా అందు బాటులో ఉంచాలని వ్యవసా య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టి .శేఖర్,ఏ డి ఏ సరిత, ఏ ఈ ఓ మున్నికృష్ణ, తహసి ల్దా ర్ కృష్ణయ్య, ఏఈలు నిషిత, క్రాంతి కుమార్, మార్కెట్ కమిటీ చై ర్మన్ అంకటి సత్యం, సర్పంచ్ చిన్న వెంకటేశం, వ్యవసాయ అధి కారులు, రైతులు కలెక్టర్ వెంట ఉన్నారు.
సంక్రాంతి నాటికి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ సెంటర్
నల్లగొండ: నల్గొండ జిల్లా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉం డనున్న పతంజలి పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీ ని ర్మాణ పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తి చేసి అందు బాటులోకి తీ సుకురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదే శించారు.గురువారం జిల్లా కలెక్టర్ నల్గొం డ జిల్లా విఅనుముల మండలం, యాచారం గ్రామంలో 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం లో ఉన్న పతంజలి పామ్ ఆ యిల్ ప్రాసెసింగ్ కంపెనీ పనులను పరిశీలించారు.నిర్మాణ యంత్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయా లు, విద్యుత్ కనెక్ష న్, ప్రాసెసింగ్ విభాగాలు, పార్కింగ్, ప్రధాన ప్రవేశ ద్వారం త దితర అంశాలను పరిశీలిస్తూ అధికారులను, కం పెనీ ప్రతి నిధులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తు న్నదని, రైతులు పండించే ఆయి ల్ పామ్ పంటకు మా ర్కెట్ సమస్య లేకుండా ఈ ప్రాసెసింగ్ యూ నిట్ కీలకంగా ఉపయోగపడు తుందని కలెక్టర్ అన్నారు. అందు వల్ల రైతు లకు ఈ పరిశ్రమ వల్ల క లిగే ప్రయోజనాలపై విస్తృ తంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పం ట కోసి న వెంటనే సమీపంలోనే ప్రాసెసింగ్ సౌకర్యం అందు బాటులో ఉం డడం వల్ల రైతులకు రవాణా వ్యయం తగ్గడ మే కాకుండా, పంట నాణ్యతను కాపాడుతూ మంచి ధర లభించే అవకాశం ఉంటుం దని తెలిపారు.
ఈ పరిశ్రమ ద్వా రా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువత కు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పారు .నిర్మా ణ పనులు వేగవంతం చేసి, నిర్ణయించిన గడువులోగా పూ ర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.నిర్మాణానికి అవసరమైన మెటీ రియల్ మొత్తం వచ్చిందా ?, ప్ర స్తుతం ఏయే పనులు కొనసాగు తున్నాయి? ప్రాసెసింగ్ యూనిట్, పార్కింగ్ స్థలం, ప్రధాన ప్రవేశ మార్గం, ఇతర మౌ లిక వసతుల పనులు ఏ ద శలో ఉన్నాయనే విషయాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
పతంజలి యాజమాన్య ప్రతిని ధులు స్పందిస్తూ మిల్లుకు అవ సరమైన యంత్రాలలో సుమారు 90 శాతం ఇప్పటికే సైట్‌కు చేరు కున్నాయని, సివిల్ నిర్మాణ పను లు వేగంగా కొనసాగుతున్నా య ని తెలిపారు. అలాగే హైటెన్షన్ (HT) విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు కు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని, మిగిలిన యంత్రాల ఏర్పాటు, అంతర్గ త అభివృద్ధి పనులు పూర్తి చేసి వ చ్చే సంక్రాంతి నాటికి పరి శ్రమను ప్రారంభించేలా చర్యలు తీసుకుం టున్నామని కలెక్ట ర్‌కు వివరించా రు.
నిర్మాణ పనుల నాణ్యతలో ఎ లాంటి రాజీ పడకుండా, రై తుల కు త్వరితగతిన సేవలు అందిం చే విధంగా అన్ని ప నులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతు లకు ఆయిల్ పామ్ సాగు ప్రయో జనా లు, పంట కొనుగోలు విధా నం, ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా లభించే సౌకర్యాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత ప్రచా రం నిర్వహించాలని సూచించా రు. జిల్లా హార్టికల్చర్ అధికారి టి. శేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అ ధికారి వినోద్ కుమార్, శాస్త్రవేత్త రాములమ్మ,పతంజలి ప్రతినిధులు సంగ ని కుమార్,బి యాదగిరి ,బొబ్బిలి వినాయక, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.







