Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రబీలో ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర పొం దేందుకు రైతులు నాణ్యత ప్ర మాణాలతో కూడిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాలకు తీసు కురావాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కో రారు. ఆదివారం ప్రాథమిక వ్యవ సాయ సహ కార సంఘం ఆధ్వర్యంలో నల్గొండ సమీపంలోని ఆర్జల బా వి వద్ద ఏర్పాటుచేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించా రు.
ఈ సందర్భంగా మీడియా ప్రతిని ధులతో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తూర్పార బట్టి తాలు,తరుగు, చెత్త వంటివి లేకుండా నాణ్యమైన ధా న్యాన్ని తీసుకువచ్చినట్లయితే రాష్ట్ర ప్రభు త్వం గ్రేడ్“ ఏ” ధాన్యా నికి ప్రకటిం చిన 2389 రూపాయ లు, కామన్ వెరై టీకి 2369 రూపా యల మద్దతు ధరను పొందవచ్చని తెలి పారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పురబట్టే యంత్రాలను సిద్ధం గా ఉంచినట్లు ఆయన వెల్లడిం చా రు.ఈ రబీలో జి ల్లాలో401ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే సేందు కు జిల్లా యంత్రాంగం చర్య లు చేపట్టిందని, కొనుగోలు చేసి న ధాన్యాన్ని మిల్లులకు పంపించేం దుకు 124 రైస్ మిల్లు లను అను సంధానం చేయగా, కొనుగోలు కేంద్రాలలో అవస రమైన తేమ కొలిచే యంత్రాలు, తూర్పార బట్టే యంత్రాలు, టార్పాలిన్లు,గన్ని బ్యాగు లు అన్ని సిద్ధంగా ఉంచడం జరి గిందని, అంతేకాక సెంటర్ ఇ న్చార్జిల కు ఇదివరకె ధాన్యం కొనుగోలుపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధా న్యాన్ని సీనియార్టీ ప్రకారం సీరియ ల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేస్తారని ఆయన వెల్ల డించారు. ఈ నెల 2 ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రా మస భల సందర్భంగా చిట్యాల మండలం, ఉరుమడ్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రె డ్డి ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
రబీలో రైతులు పండించి న ధా న్యాన్ని ఎలాంటి ఇబ్బందు లు లేకుండా కొనాలని, ఇందుకు పూర్తి సహకారం అందించా లని రైస్ మిల్ల ర్లతో ఇది వరకే విజ్ఞప్తి చేయడం జ రిగిందని, అనవసరంగా రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన రైస్ మిల్లర్లతో కోరారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తో పాటు, రెవె న్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థాని క సంస్థల ఇంచా ర్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డిప్యూ టీ మేయర్ అమీ ర్ అలీ, పౌ రసరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతి,మా జీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మా జీ జెడ్పిటిసి గు మ్మల మోహన్ రెడ్డి , పిఎసిఎస్ చైర్మన్ నాగ రత్నం రాజు, మాజీ జెడ్పి టిసి లక్ష్మయ్య, తహసిల్దార్ పరు శురాం తది తరులు ఉన్నారు.
