Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:07 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ 

Nalgonda Collector Chandrashekhar :ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జి ల్లా కేంద్రంలోని రాంన గర్‌లోని పా త మోనా కాలేజీ ప్రాంగణంలో ఉన్న మైనారిటీ బాలికల రెసిడె న్షియ ల్ పాఠశాల మరియు కళాశాలను జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధ వారం ఆకస్మికంగా సంద ర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా లో సంక్షేమ వారోత్సవాలు ఉత్సాహంగా కొన సాగుతుండ గా, జిల్లా కలెక్టర్ పాఠశా లలో జరుగుతున్న రో జువారీ కా ర్యక్రమాలు, విద్యార్థినులకు అందుతున్న వస తులను స్వయంగా పరిశీలించారు.

పాఠశాల భవనం అంతటా పరిశీలించిన కలెక్టర్, కొన్ని చిన్న పాటి మరమ్మతుల అవసరాన్ని గుర్తించి, వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డైనిం గ్ హాల్ ,స్టోర్ రూమ్, వంటగది లో కూరగాయలను పరిశీలించారు. కి చెన్ చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పా రు. వేసవి సెలవుల సందర్భంగా రెసిడెన్షియల్ పాఠ శాల మూసే సమయంలో ఎక్స్పరి డేట్ అయి పోయిన వం ట సరుకులు తీసేయాలన్నారు.పాఠశాలల పునఃప్రారంభం లోపు మైనర్, మేజర్ రిపేర్ల ను చేయించు కోవాలని చెప్పా రు.

అనంతరంవిద్యార్థినులతో ముఖాముఖి మా ట్లాడుతూ ఉ న్నత లక్ష్యాలను నిర్దే శించుకుని వాటి సాధనకు పట్టు దల తో కృషి చేయాలని సూచిం చారు. సివిల్ సర్వీసెస్ సాధిం చాలనే ఆశయంతో ఉన్న విద్యార్థిను లను ప్రోత్స హిస్తూ వారికి అవసర మైన స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాల ను జిల్లాయంత్రాంగం తరఫున అందిస్తామని హా మీ ఇచ్చా రు.

విద్యార్థినులు తల్లిదండ్రులకు రో డ్డు భద్రతపై అవగాహన కల్పించా లని, ద్విచక్ర వాహనాలు నడిపేట ప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరిం చేలా ప్రోత్సహించాలని కలెక్టర్ చె ప్పారు. సంక్షేమ వారోత్సవాల సం దర్భంగా నిర్వహించిన వ్యాసర చన, క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలలో విజేత లైన విద్యార్థిను ల కు బహుమతులు అందజేసి అభి నం దించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికా రి విజ యేందర్ రెడ్డి, మైనారిటీ రెసిడెన్షియల్ ఆర్‌ సిఓ శ్రీ కాంత్, పాఠశాల ప్రిన్సిపాల్ షా హీన్ షేక్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.