Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 January 2026, 2:02 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఉద్బో ధ, ప్రజల్లో రోడ్డుభద్రతపై అవగా హన ప్రతీ ఒక్కరిలో అనివార్యo

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: రోడ్డు భద్ర తపై ప్రజల్లో అవగాహన అత్యంత అ వసరం అని జిల్లా కలెక్టర్ బడు గు చంద్రశేఖర్ అన్నారు. జా తీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్బంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం రవాణాశాఖ ఆధ్వర్యం లో ఎన్ జి కాలేజ్ నుండి రామగిరి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన రో డ్డు భద్రత అవగాహన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ లు జండాఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ రోడ్డు ప్రమాదా ల వల్ల అనేక మంది విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని, ఇది అత్యంత ఆందోళనకరమన్నారు. రోడ్డు ప్రమాదాల ని వారణకు ప్రజల్లో అవ గాహన పెంపొందించడమే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చ క్రాల వాహనదారులు సీట్‌ బెల్ట్ వాడాలని సూ చించారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ నిబంధనలను కచ్చి తంగా పాటిస్తూ ఇతరులకు ఆ దర్శంగా నిలవాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబై ల్ ఫోన్ విని యోగిస్తూ డ్రైవింగ్ చేయడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కా రణాలని అన్నారు. ఒక్క క్షణ ని ర్లక్ష్యం జీవితాంతం పశ్చా త్తాపంగా మారుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను గౌరవి స్తూ, రహదారిపై శాసనబద్ధంగా ప్ర యా ణించడమే సురక్షిత జీవనానికి మార్గమని పేర్కొన్నారు. జి ల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డిటివోలావ ణ్య, డీఎ స్పీ శివరాం రెడ్డి, ఎంవిఐ కొండ య్య, మల్లికార్జున్ రెడ్డి, స్వప్న, యువకులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.