Praja Deveena
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 2:02 pm Posted by : praja deveena

Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఉద్బోధ, ఓటుహక్కు శక్తివంతమైన ఆయుధo

Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హక్కు శక్తివంతమైన ఆయుధమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొ న్నారు. 16 వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కలెక్టర్ కార్యా లయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిం డిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కో రారు.

ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించవ ద్దని, ప్ర తి ఓటరు చైతన్యం కావాలన్నారు. దేశంలో యంగ్ ఇండియన్స్ ను చైతన్యం చేసేందుకు వివిధా రకాల ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి గ్రామ పంచాయతీ ఎన్నికల లో జిల్లాలో 80 శాతం ఓటర్లు ఓటు వేశారని,అసెంబ్లీ ఎన్నికల్లో అ ర్బన్ లో 60 శాతం ఓట ర్లు మాత్రమే ఓట్లు వేశారన్నారు.

మహిళా ఓటర్ల శాతం ఎక్కువగా ఉందని, గ్రామీణ ఓటర్లు ఎక్కువ గా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, పట్టణ ఓటర్లు మాత్రం ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేస్తు న్నారని తెలిపారు. ఓటు మనకున్న అత్యంత శక్తివంతమైన ఆ యుధమని, ప్రజల అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించే మార్గం ఓటే అని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు భాగస్వామి అని కలెక్టర్ స్ప ష్టం చేశారు. 18 సంవత్సరాలు పూర్తయిన యువత తప్ప నిసరిగా ఓటరు గా నమోదై ఎన్నికలలో బాధ్యతా యుతం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చా రు.

జిల్లాలో గ్రామ స్థాయిలో ని ప్రతి ఓ టరు ను నమోదు చేసి ఎస్ఐఆర్ 74 శాతంపూర్తి చేసినందుకు జా తీయస్థాయిలో అవార్డు రావడం ప ట్ల ఈఆర్వోలను, బిఎల్ఓలను అ భినం దించారు. ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ 18 సంవత్సరాలు నిండి కొత్తగా ఓటు హక్కును పొందిన 5 గురికి ఓటరు గు ర్తింపు కార్డులు అందజేశారు.

కార్యక్రమానికి హాజరైన వారందరి చేత జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముం దు ఓటర్లను చైతన్య పరచడానికి ఉద్దేశించి జిల్లా విద్యాశాఖ అధికారి కా ర్యాలయం నుండి జిల్లా కలెక్ట ర్ కార్యాలయం వరకు“ సండే సైకి ల్” అనే నినాదంతో ఏర్పాటు చే సి న సైకిల్ ర్యాలీని జి ల్లా కలెక్టర్ ప్రారంభిస్తూ జాతీయ ఓటర్ల దినోత్స వం సంద ర్భంగా ఓటరు అవగాహనతో పాటు, ప్రతి ఒక్కరూ ఆరో గ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలి పారు.

రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్, స్థానిక సంస్థల ఇం చార్జ్ అద నపు కలెక్టర్ వై .అ శోక్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధి కారి చోల్లేటి ప్రభాకర్, ఈఆర్వోలు, బిఎల్ఓలు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.