OpinionPoliticsక్రైంతెలంగాణనల్గొండహైదరాబాద్

Nalgonda Congress Cadre Fumes Over BJP : బిగ్ బ్రేకింగ్, బిజెపిపై భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు, ఇలాంటి ఘట నలు పునరావృతమైతే తీవ్ర పరి ణామాలు తప్పవని హెచ్చరిక

Nalgonda Congress Cadre Fumes Over BJP :ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన మంత్రి కోమటి రెడ్డి క్యాంప్ కార్యాల యం పై దాడి ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించా యి. నల్లగొండలో నిర్వహించిన మీడియా సమావే శంలో కాంగ్రెస్ నేతలు బీజేపీ తీరుపై మండిపడ్డారు. మరోసారి ఇ లాంటి ఘటనలు పునరావృత మైతే తీవ్రపరిణామాలు త ప్పవని, నిరసనకు హద్దులుంటాయి.. మళ్లీ ఇలాంటివి జరిగితే పరి ణామాలు తీవ్రమంటూ హెచ్చరించారు. దీంతో మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం పై జరిగిన దాడి ఘ టన నల్లగొండలో రాజకీయ వేడిని మరింత పెంచింది. ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్ర జాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉ న్నప్పటికీ.. దాడులకు పాల్ప డటం సరైన పద్ధతి కాదని కాం గ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వ హించిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మా ట్లాడుతూ బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి పై తీవ్ర వి మర్శలు చేశారు. బీజేపీలో విలు వలు కలిగిన నా యకులు ఎంతో మంది ఉన్నారని, అయితే కొందరి వ్యవహా రశైలి ఆ పార్టీకి నష్టం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. మం త్రి ఇంటిపై దాడి చేస్తే కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకో బోవ ని, ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే తీవ్ర పరిణా మా లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిం చారు. బీజేపీ, బీ ఆర్ఎస్ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా లో ప్రచారం కోసం కొందరు నేతలు రె చ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

 

నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మ న్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కూ డా ఘాటుగా స్పందించారు. దాడికి ప్రతిదాడి ఎప్పుడైనా ఉంటుందని, అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలు తెలిపింద ని అన్నారు.మంత్రి ఇంటిపై దాడి చేసిన అనంతరం బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి కార్యాలయంలో దాక్కున్నారని ఆరోపించిన ఆయన.. దమ్ముంటే బయటకు రావాలని సవా ల్ చేశారు. తన తల్లిపై దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచా రంలో వాస్తవం లేదని, అది తప్పుడు ప్రచారమని పే ర్కొన్నా రు. నల్లగొండ బీఆర్ఎ స్ మాజీ ఎమ్మెల్యే కూడా విలువ లు మరిచి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తమ ను ఎవరైనా రెచ్చగొడితే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు.

  ఆర్విఆర్ ను పొలిమేరలోనే అడ్డుకుంటాం

నల్లగొండ మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి మరింత తీ వ్రంగా స్పందించారు. బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు రామచం ద్రరావు పరామర్శల పేరుతో నల్లగొండకు వస్తే నల్లగొండ పొ లిమేర నుంచే అడ్డుకుంటామని, తరిమికొడతామని వ్యా ఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న నల్లగొండను రాజకీయల బ్ధి కోసం కొందరు నేతలు రెచ్చగొడుతున్నారని ఆరోపించా రు. తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో నల్లగొండ నగర డిప్యూటీ మే యర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ జెడ్పీటీసీ వం గూరి లక్ష్మ య్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కార్పొరేటర్లు బొజ్జ శంక ర్, అల్లి సుభాష్ యాద వ్, సమద్, ఇబ్రహీం, ఏదుళ్ల శ్రీధర్ రె డ్డి, మామిడి కార్తీక్, ఇటికాల శ్రీనివాస్, నల్లగొండ పట్టణ కాం గ్రెస్ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, యూత్ కాంగ్రెస్ పట్ట ణ అధ్యక్షుడు గాలి నాగరాజుతో పాటు పలువురు కాంగ్రెస్, యువజ న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి క్యాంప్ కా ర్యాలయంపై దాడి ఘటన నే పథ్యంలో ఇరు పార్టీల నేతల మ ధ్య మాటల యుద్ధం తీవ్రతరం కావ డంతో.. నల్లగొండ రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Related Articles

Back to top button