Praja Deveena
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 12:48 pm Posted by : praja deveena

Minister Komatireddy Venkat Reddy : నల్లగొండ కార్పొరేటర్ లు చరిత్రలో నిలిచేలా పనితీరు ప్రదర్శించాలి 

 

Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు నూత నం గా ఎన్నికైన మొదటి కార్పొరేట ర్లు చరిత్రలో నిలిచిపోయేలా పని చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు భవి ష్యత్తులో ఉన్నత శిఖరాలను అ ధిరోహించాలని,ప్రజలకు మంచి సేవలు అందించి గొప్ప పే రు తెచ్చుకో వాలని, పదవులు శాశ్వతం కాదని, ప్రజల న మ్మకానికి అనుగుణంగా పనిచేసే మంచి నడవడికతో, అన్ని వర్గాల ప్రజల మన్ననలను చూరగొనాలని, సమస్యలను మే యర్ తో పాటు, అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని మంత్రి కో రారు.

సోమవారం నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నిర్వహించిన నల్గొండ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డి ప్యూటీ మేయర్ ఎన్నికలలో ఆయన పాల్గొన డ మే కాకుండా నల్గొండ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్ల ప్ర మాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ప్రమాణ స్వీకార అనంతరం నూతన కార్పొ రేటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.

నల్గొండలో సామాజిక న్యాయం చేసేందుకు డిప్యూటీ మే యర్ పదవిని మైనార్టీ వర్గాలకు అందించడం జరిగిందని, కొ త్తగా ఎన్నికైన కార్పొ రేటర్లు అందరూ కలిసి పనిచేయా ల ని, పట్టణ అభివృద్ధి మీచేతుల్లో ఉందని, అందరూ కలిసిక ట్టుగా పనిచేస్తే మరింత అభివృద్ధి సాధిస్తామని, పేదల సం క్షేమం విషయంలో రాజీపడవద్దని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కా ర్యక్రమాలు అమలుచేస్తున్నదని, రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా బీదలందరికి ఆరు కేజీల సన్నబియానిస్తు న్నదని, 200 యూనిట్ల వరకు ఉ చిత విద్యుత్ పేరుమీద ఇప్పటి వ రకు 5000 కోట్ల రూపాయలు వి ద్యుత్తు బోర్డుకు చెల్లించ డం జరిగిందని తెలిపారు.

 

తన స్వంత నిధులతో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి లాప్రోస్కో పిక్ యంత్రం తెప్పించడమే కాకుండా, మాన్యం చెల్క ప్రభుత్వ ఆసు పత్రి నూతన భవనాన్ని నిర్మించ డం జరుగుతున్నదని, అది పూ ర్తయ్యే దశలో ఉందని, బొట్టు గూడ పాఠశాలలాగే మరో నాలుగు పాఠ శాలలను అభివృ ద్ధి, చేయను న్న ట్లు మంత్రి వెల్లడించారు. నల్గొండ అభివృ ద్ధికి నిధులకు కొరత లేదని, త్వరలోనే నల్గొండ మున్సిపా లిటీకి 1137 కుట్టుమిషన్లు రానున్నాయని, వీటిని అన్ని వా ర్డులకు సమానంగా పంచుతామని, పేద మహిళలకు వీటిని అందించాలని, కార్పొరేటర్లు అందరు కలిసి పనిచేస్తే తక్షణ మే ముఖ్య మంత్రి ద్వారా 100 కోట్ల, రూపాయలు నల్గొండ కార్పొ రేషన్ కు తెప్పించే ఏర్పాటు చేస్తానని ఆయన తెలి పారు.

కాగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా బుర్రి చైతన్యరెడ్డి, డిప్యూటీ మేయర్గా  అస్రఫ్ అలీ మొహ మ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వ్యవసాయ అధికా రి, మున్సిపల్ కా ర్పొరే షన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎ న్నికల ప్రత్యేక అధికారి శ్రవణ్ ఆధ్వర్యంలో మేయర్, డి ప్యూటీ మేయర్ ల ఎన్నికలను నల్గొండ మున్సిపల్ కార్పొరే షన్ సమావేశ మం దిరంలో నిర్వహించడం జరిగింది. మే యర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్ను కున్నట్లు ప్రత్యేక అధికారి ప్రకటిం చారు. ఈ సందర్భం గా ఆయన మేయర్,డిప్యూటీ మేయర్లతో పాటు నూతనం గా ఎన్ని కైన కార్పొరేటర్లందరి చేత ప్రమాణ స్వీకారం చే యించారు.

 

ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కార్యక్ర మానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.చంద్ర శేఖర్ మాట్లాడు తూ మొదటి సారిగా మేయర్, డి ప్యూటీ మేయర్ తో పాటు, కార్పొ రేటర్లైన అం దరికి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమా లను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్పొరే ట ర్ల పై ఉందన్నారు. అన్ని డివిజన్ల ను సమానమైన అభి వృద్ధికి కృషి చేయాలని, ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ అందరి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను తనిఖీ చేస్తూ చట్టానికి లో బడి ప్రజలతో మమేకమై ప నులు చేపట్టాలని సూచిం చారు.

నల్గొండ కార్పొరేషన్ నూతన మేయర్ గా ఎన్నికైనబుర్రి చై తన్య రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నల్గొండ కా ర్పొరేషన్ మేయర్ గా పదవి బాధ్యతలు అప్పగించినం దు కు కష్టపడి పనిచేసి ప్రజలకు మే లు చేస్తానని అన్నారు. త నకు మేయర్ అవకాశాన్ని కల్పించిన అం దరికీ ఆమె కృ త జ్ఞతలు తెలిపారు. తనకు తన భర్త కుటుంబానికి రా జకీ యాలలో ఉన్న అనుభవాన్ని ఆధారం చేసుకుని రాష్ట్ర రో డ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఇకపై నల్గొండ ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకు రా వాలని, తద్వారా మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరి ష్కా రానికి కృషి చేస్తానన్నారు. నల్గొండ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, భ వ నాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఇదివరకే 2200 కోట్ల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,ఘాట్ రోడ్లు ,సిసి రో డ్లు వేయిస్తు న్నారని, అంతేకాక మంత్రి సొంత నిధులను వె చ్చించి విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు.

డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ మహమ్మద్ మాట్లాడుతూ త నపైన మ్మకంతో డిప్యూటీ మేయర్ పద వినిచ్చినందుకు కృ తజ్ఞతలు తెలి పారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రలు నూతన మేయర్ బుర్రి చైతన్య రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్ర ఫ్ అలీ మహమ్మద్, నూతన కార్పొరేటర్ లందరికీ పుష్ప గు చ్ఛాలు అందించి శాలువా మొమెంటులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, అధి కారులు పాల్గొన్నారు.