Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda Court POCSO Verdict : బిగ్ బ్రేకింగ్, పోక్సో కేసులో నల్ల గొండ కోర్టు సంచలనతీర్పు, మైన ర్ పై అత్యాచారం కేసులో నింది తుడికి 10 ఏళ్ల కఠిన జైలు

Nalgonda Court POCSO Verdict : ప్రజా దీవెన, నల్ల గొండ క్రైమ్: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితు డికి నల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కఠిన శిక్ష విధిం చింది. నింది తుడికి 10 సంవత్స రాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా విధి స్తూ సోమవారం సంచలన తీర్పు వె లువరించింది. అంతేకాకుండా బాధితురాలికిరూ.7 లక్షల పరి హారం అందించాలని న్యాయస్థా నం ఆదేశించింది.

 దిండి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

దిండి పోలీస్ స్టేషన్ పరిధిలో 20 20లో ఈ ఘటనకు సం బంధించి క్రైమ్ నంబర్ 97/2020గా కేసు నమోదైంది. అ నంతరం SC PO CSO No.101/2021కింద కేసు విచారణ కొనసాగింది. ప్రతాప్‌న గర్ గ్రామానికి చెందిన ముదావత్ మల్లేష్ (23)పై అత్యాచారం, బెదిరింపులు, POCSO చట్టం లో ని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సా క్ష్యాలను కోర్టు లో సమర్పించడంతో పాటు ప్రాసి క్యూషన్ వాదనలు సమర్థవంతంగా వినిపించింది.

 నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

కేసును పూర్తిగా విచారించిన న ల్లగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నింది తు డిని IPC సెక్షన్ 376(2) కింద దోషిగా నిర్ధారిం చింది. అనంతరం అతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష (RI)తో పాటు రూ. 5,000 జరిమానా విధించింది.
జరిమానా చెల్లించకపోతే అద నంగా మూడు నెలల సాధా రణ కారాగార శిక్ష (SI) అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం

ఈ కేసులో బాధితురాలికి రూ . 7,00,000 పరిహారం అం దించాలని న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలికి అవసరమైన న్యా య సహకారాన్ని భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ ఎం. కల్పన అం దించారు. ఈ కేసులో దిండి పో లీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం. రాములు (HC-1887) మొదటి దర్యాప్తు అధికారిగా, దిండి సీఐ డి. వెంకటేశ్వర్లు రెండో దర్యాప్తు అధికారిగా విధులు నిర్వహించారు.

కేసు విచారణలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రం జి త్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. కోర్టు డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ కె. కృష్ణ, పి. లింగయ్య, లైజన్ అధి కారులు హెడ్ కానిస్టేబుల్ పి. నరేందర్, పి.సి. ఎన్. మల్లికార్జు న్ సమన్వయంతో విధులు ని ర్వహించా రు. ప్రస్తుతం దిండి ఎస్‌ ఐ చి. బాలకృష్ణ, దిండి సీఐ కె. బీ సన్న కేసుకు సంబంధించిన కో ర్టు ప్రక్రియలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ మ హిళలు, బాలికలు, చిన్నారులపై జరిగే నేరాల కేసు ల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, బాధి తులకు త్వరి తగతిన న్యాయం అందేలా పోలీస్ శాఖ కృషి చే స్తోం దన్నారు.POCSO కేసుల్లో ఆధారాల సేకరణ నుంచి కోర్టు వి చారణ వరకు ప్రతి దశను సమ ర్థవంతంగా నిర్వ హిస్తూ నిందితు లకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా చర్యలు కొన సా గిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

Related Articles

Back to top button