Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లా

Nalgonda district brutal joint murders : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో విషాదం, కంట్లోకారంచల్లి తల్లీకూతుళ్ల దారుణహత్య

Nalgonda district brutal joint murders :  ప్రజా దీవె న, అనుముల: నల్లగొండ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించి న దారుణ హత్యోదంతం వెలుగు చూసింది. అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో గుర్తుతెలియని దుండగు లు తెగబడ్డారు. న డిరోడ్డుపై కాపు కాసి, అత్యంత కి రాత కంగా తల్లీకూతుళ్లను నరికి చంపారు.

ఈ దారుణ దుర్ఘటన కు సంబం ధించి స్థానికులు అందించి న వివ రాల ప్రకారం దుండగులు పథకం ప్రకారమే ఈ దా డులకు పాల్పడ్డా రు. బాధితులు ఎదురుపడగానే ఒక్కసా రిగా వారి కళ్లలో కారం చ ల్లారు. కళ్లు కనబడక, ఏం జరుగు తుందో తెలుసుకునే లోపే వేటకొడవళ్లతో విచక్షణారహితం గా నరికి చంపారు. రక్తపు మడుగులో పడి ఇద్దరూ అక్కడిక క్కడే ప్రాణాలు విడిచారు.మృతులు తల్లి రుద్రాక్ష సుమలత, కూతురు రుద్రాక్ష లావణ్యగా గుర్తించారు.

   భూతగాదాలే అసలు కారణమా ? 

గ్రామంలో ఈ జంట హత్యలు స్థాని కంగా తీవ్ర కలకలం రే పగా గత కొంతకాలంగా సాగుతున్న భూతగాదాల నేపథ్యం లోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని గ్రామస్థులు గట్టిగా అ నుమానిస్తున్నారు. పాత కక్షలను మనసులో పెట్టుకునే దుం డగులు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. పోలీసు ల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలా ని కి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇది లా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button