Nalgonda district collecter chandhra shekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలస్థాయిలో ప్రజావాణి

Nalgonda district collecter chandhra shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజల స మస్యలను మండల స్థా. యిలోనే పరిష్కరించేలా ప్రతి సోమవారం మండల స్థా యి లో ప్రజావాణి కా ర్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ అధికా రులను ఆదేశించారు. మండల స్థాయి లో నిర్వహించే ప్రజావాణికి ఎంపీడీవో, తహసీల్దార్, ము న్సి పల్ కమిషనర్‌తో పాటు, ప్రత్యేక అధికారులు హాజరు కా వాలన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డీవో లు, తహసీల్దార్లు,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాలపై సమీక్షించారు.
ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం1 గంట వరకు మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహిం చాలని ప్రజ ల నుండి స్వీకరించిన ప్రతి దరఖాస్తును ప్రజా వాణి పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని, ప్రతి ద రఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి 15 రోజుల్లోగా పరి ష్కరిం చాలని,ప్రజావాణికి వచ్చే ప్రతి వ్యక్తి సమస్యను అధికారు లు ఓపికగా విని అర్థం చేసుకోవా లని, ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని అన్నారు.ప్రజావాణిలో పా ల్గొనని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావా ణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చే యా లని ఆదేశించారు. టెంట్లు, టేబుల్లు, కుర్చీలు, మంచినీటి సౌ కర్యం కల్పించాలని సూచిం చారు. ప్రజావాణి ముగిసిన త ర్వాత అధికారులు సమీక్ష ని ర్వహించి, ఆ వారం వచ్చిన ద రఖాస్తులపై శాఖల వారీగా చర్చించి పరిష్కార చర్యలు చేప ట్టాలని తెలిపారు.
అవసరమైన సందర్భాల్లో సర్పం చులకు కూడా సమాచా రం అందించాలని సూచించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్ర జావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును పరిష్కరించే లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ,శాఖల వా రీగా వచ్చిన ఫిర్యాదు లను సమీక్షించి ప్రజలకు సరైన సమా ధానం ఇవ్వాలని, అవసర మైన ప్రాథమిక సమాచారాన్ని అందిస్తూ సమస్య పరిష్కారమయ్యే వరకు బాధ్యతగా వ్యవహ రించాలని,ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకురావాలని,మండల స్థా యిలో నిర్వహించే ప్ర జావాణికి సంబంధించి సాంకేతి కంగా అందరూ అనుసంధానం అయ్యేలా మొబైల్ లింక్ ఏర్పా టు చేయాలని, ఎంపీడీవోలు, ఆ ర్డీవోలు, తహసీల్దార్లు తదితర అ ధికారులు లింక్‌ను ఓపెన్ చేసు కొని కార్యక్రమంలో భా గస్వాము లు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలే ప్రభు త్వానికి ముఖ్య మని, వారి సమస్యలను పరిష్కరించడమే అధికారుల ప్రధాన బా ధ్యత అని స్పష్టం చేశారు. మండ ల స్థాయి ప్రజావాణి కార్యక్రమం పై ప్రజలకు విస్తృతంగా ప్రచా రం కల్పించి, ప్రజలు సులభంగా త మ సమస్యలను అధికా రుల దృష్టికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని సూచిం చారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వే డుకలను జిల్లాలో ఘనం గా ని ర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలె క్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాలను సమన్వ యంతో నిర్వహిం చి విజయవంతం చేయాలని సూ చిం చా రు. జిల్లాలోని ప్రజలు, ప్ర జాప్రతినిధులు, అధికారులు, సి బ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు వచ్చినచోట వనమహోత్సవం కింద విస్తృతంగా మొక్కలు నాటాలని, కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తు న్నందున సద్వినియో గం చేసుకొని విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాల ని కలెక్టర్ సూచించారు. ప్రభు త్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామాలు, అనువైన ప్రదే శాలను గుర్తించి మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. ఈ వీడీయో కాన్ఫరెన్స్లో రెవి న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశర థ్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద న పు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసి ల్దార్లు పాల్గొన్నారు.
పోటీపరీక్షల్లో పోటీపడేలా విద్యార్థులు చదవాలి
నల్లగొండ: విద్యార్థులు చదువు తో పాటు వివిధ పోటీ పరీ క్షల్లో పోటీపడేలా చదవాల్సిన అవసరం ఉందని జిల్లా కలె క్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన నల్గొండ లోని బొట్టుగూడ ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా ర్థులకు యూనిఫార్మ్స్, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. 8వ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులు నేషన ల్ మీన్ మెరిటోరియస్ స్కాల ర్షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్ ) పరీక్షకు హాజరు కావాలని,ఇందుకు కష్ట పడి చదవాలని సూచిం చారు. మెరిటోరియస్ స్కాలర్షి ప్ పరీక్ష ఉత్తీర్ణులైతే 8వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి సంవ త్సరం 12000 రూపాయల ఉపకార వేతనం విద్యా ర్థులకు వస్తుం ద ని, దీనిని సద్వినియోగం చేసు కోవాలని కోరారు.

ఈ సంవత్సరం డిసెంబర్ మొద టి వారంలో ఈ పరీక్ష ఉం టుందని, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 00 మంది విద్యార్థు లకు ఈ మెరి టేరియస్ స్కాలర్షిప్ వచ్చే అవ కాశం ఉందని, అందువల్ల జిల్లా లోని విద్యార్థులు బాగా చదవా లన్నారు. ఈ పరీక్షకు హాజరు కా వడం వల్ల ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు మంచి అవకా శమని, దీనిని స్ఫూర్తిగా తీసుకొ ని ఇతర పోటీ పరీక్షలకు హాజరు కావాలన్నారు. వి ద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకోవాలని, వ్యక్తి గత పరి శు భ్రతతో పాటు, పరిస రాల పరిశుభ్రత పాటించాలని, యూని ఫామ్స్, ఐడికార్డ్స్ జాగ్ర త్తగా ఉంచుకోవాలని, నైతిక వి లువలు పెంపొందించుకోవాలని సూచిం చారు.ప్రతీక్ ఫౌండే షన్ చైర్మన్ గో నారెడ్డి, ఎంఈఓ అరుం ధతి, పాఠశాల ప్రధా నోపాధ్యా యులు పడాల సురేష్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.






