Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 January 2026, 11:25 am Posted by : praja deveena

Nalgonda District Collecter : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ ఆదేశాలు, ఆహార ఉత్పత్తి కేంద్రాలపై విస్తృతదాడులు నిర్వహించాలి

 

Nalgonda District Collecter:  ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజలకు సు రక్షితమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా ఆహార భద్రత అధికారులు హోటల్లు, దాబాలు, తిను బండారాలు, ఆహార ఉత్పత్తుల కేం ద్రాలపై విస్తృత తనిఖీలు, దాడులు నిర్వహించాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (collecter Chandra Shekh ar badugu) అన్నారు.శుక్రవారం తన చాంబర్లో  నిర్వహించిన జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ( Food Safety Ad visory Committee) సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ హార భద్రత అధికారులు జిల్లాలోని అన్ని పాఠశాల లు, హాస్టళ్లు, అంగన్వాడి కేంద్రాలు ,ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల నుండి ఆహార శాంపిల్లు సేకరించాలని ఆదేశించారు.

కాంట్రాక్టు కాటరింగ్ ఉన్న ప్రతి సంస్థ నుండి ప్రతినెల ఒకసారైనా శాంపి ల్లు సేకరించాలని,ఆహార నాణ్యత పౌష్టికాహార విలువలను తనిఖీ చే యాలన్నారు. ఒకవేళ ఎవరైనా కల్తీ ఆహారం అమ్ముతున్న ట్లయితే కేసు లు నమోదు చేయాలని చెప్పారు. ప్రజలు కల్తీ ఆహా రం వల్ల అనారో గ్యం పాలు కాకుండా ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి విస్తృత ప్రచారం ( publicity ) నిర్వహిం చాలని చెప్పారు. అలాగే అన్ని పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, అంగ న్వాడి కేంద్రాలకు ఎఫ్ఎస్ ఎస్ ఏఐ లైసెన్సులు జారీ చేయాలని, మే చివరి నాటికి జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠ శాలలు ఎ ఫ్ఎస్ ఎస్ ఏ ఐ సర్టిఫికెట్ కలిగి ఉండేలా చర్యలు తీసు కోవాలని తెలిపారు.

పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలకు ఎఫ్ఎస్ ఎస్ ఏఐ ధ్రువపత్రం జారీ విషయమై ఎంఈఓ లు కాంప్లెక్స్ హె డ్మాస్టర్ల తో సమావేశం ని ర్వహించి దరఖాస్తు, శిక్షణ ఇవ్వాలని, కాంప్లె క్స్ హెచ్ఎంలు హెడ్మా స్టర్లకు ఈ వి షయంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అ లాగే రహదారి 65 జాతీయ రహదారిపై ఉన్న హోట ల్లు ,దాబాలను ఆకస్మిక తనికీలు, దాడులు నిర్వహించి ఆహారాన్ని తనిఖీ చేయా ల ని చెప్పారు.ఇదివరకు కేసులు నమోదు చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని, పాఠశాలల్లో ఆహార వస్తువుల భద్రత, నిలువలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కల్తీ ఆహారంపై ఎక్కడైనా ఫి ర్యాదులు వస్తే ఖచ్చితమైన చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు.

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితో పాటు, ఏరియా ఆసుపత్రుల లో సంబంధిత సూపరింటిండెంట్లు, అందరితో కలిపి నెలకు ఒకసా రి విధిగా సమావేశాలు నిర్వహించాలని, అలాగే జిల్లా జైలులో సై తం ఎఫ్ ఎస్ ఐ లైసెన్స్ ఇవ్వాలని అన్నారు. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకొని 65 వ జాతీయ రహదారిపై హోటల్లు, దాబాలలో నా ణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసే విధంగా తనిఖీలు ని ర్వహించా లని కలెక్టర్ ఆదేశించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.స్తిని వాస్, అదనపు ఎస్పీ రమేష్, అ సిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి , సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగో పాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.