Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda district collector chandrashekar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ప్రకటన, సెప్టెంబర్ 1 నుండి కలెక్టరేట్ లోని ఉద్యోగులoదరికి ముఖగుర్తింపు హాజరు

Nalgonda district collector chandrashekar :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిధి లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఇక పై ముఖగుర్తింపు యాప్ ద్వారా హాజరు ఇవ్వాల్సి ఉంటుం దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. వనమహోత్స వం కింద ఈ నెల 25 న జిల్లా వ్యాప్తంగా సామూహిక మొ క్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ పిలుపు. ప్రజావాణి కర్యక్రమంలో భాగంగా సోమవా రం అయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులు తీసుకున్న అనంతరం జిల్లా అధి కారులతో మాట్లాడుతూ సమయపాలన, పారదర్శకత బా ధ్యతను పెంపొందించడంలో భాగంగా అధికారులు, ఉద్యో గులు ప్రజలకు అందుబాటులో ఉండేలా సెప్టెం బర్ 1 నుం డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్ని కార్యాల యా లలో అధికారి మొదలుకొని వాచ్ మెన్ వరకు ముఖ గు ర్తిం పు హాజరుఅమలు చేస్తున్నట్లు చెప్పారు. అందువల న అ న్ని శాఖల ఉద్యోగులందరు ఈ యాప్ లో నమోదు కావాల ని, ఇకపై ఈఆప్ ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులను పాస్ చేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25న జిల్లా వ్యా ప్తంగా అ న్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాల యాల్లో వనమ హోత్సవం కింద సామూహికంగా మొక్కలు నాటాలని ఆదే శించారు. అటవీ, గ్రామీ ణాభివృద్ధి, స్థానిక సంస్థల ఆధ్వ ర్యంలో ఈ బాధ్యతను చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమా న్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 60 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జ రిగిందని, ఈ సంవత్సరం వనమహోత్సవం కింద జిల్లాలో 57 లక్షల 70 వేల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయిం చినట్లు చెప్పారు. మొ క్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతి నిధులను భాగస్వామ్యం చే యాలని, ఉదయం 10 నుంచి 1 1 గంటలలోగా ఈ కార్యక్రమం చేపట్టాలని, మండలాల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనా లని చెప్పా రు.

ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా గుడిసెల స్థా నం లో ఇండ్లకు గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను వా రంలో మంజూరు ఇచ్చే విధంగా మున్సిపల్ కమిషనర్, ఎం పీడీవోలతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు తెప్పించా లని స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రె డ్డిని ఆదేశించారు. ఇకపై అ న్ని శాఖలు టి- ఫైబర్ నెట్వర్క్ ను ఉపయోగించాలని కలెక్టర్ అన్నారు . ఈ నెల 30న ని ర్వహించనున్న నీట్ పరీక్షను ఎలాంటి తప్పిదాలకు అవకా శం ఇవ్వ కుండా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఆర్సిఓలు, జిల్లా కోఆర్డినేటర్లు అన్ని హాస్టల్లో ఖా ళీలన్నిం టి ని భర్తీ చేయాలన్నారు. జిల్లా అధికారులందరూ ప్రతి నెల 5 లోగా టూర్ డైరీలు స మర్పించాలని ఆదేశించారు.

పత్రి కల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు స్పందిం చి వివరణ పంపించాలన్నారు. జిల్లా అధికారులు వారి పరి ధిలోని హాస్టళ్లను తనిఖీ చేయాలని, మండల ప్రత్యేక అధి కారి, తహసిల్దార్, ఎంపీడీవోలు హాస్టల్లలో విద్య, భోజనం, పరిశుభ్రత పై నివేదిక సమర్పించాలని ఆదేశిం చారు. వివిధ స్థాయిలలో వచ్చిన ప్రజావాణి దరఖాస్తులు సాధ్యమై నంత త్వరగా పరిష్కరించాల న్నారు. జిల్లా లో సీఎం ప్రజావా ణి 28, మండల స్థాయిలో 190 దరఖాస్తులు పెండింగ్ లో ఉ న్నా యని, సంబంధిత అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి కేం ద్రీకరించి పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహా య కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ,డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్,జిల్లా అధికారులు ప్రజ ల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు.ఈ సోమవారం రె వెన్యూ శాఖకు 5 8, ఇతర శాఖలకు 58, మొత్తం 116 ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ నెల25 నుండి సామూహికంగా మొక్కలునాటాలి 

నల్లగొండ: వనమహోత్సవం కా ర్యక్రమంలో భాగంగా ఈనెల 25 నుండి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేప ట్టి నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షణ చర్యలు చేపట్టా లని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సో మవారం హైదరాబాద్ నుండి రా ష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వనమహోత్సవం పై జిల్లా కలెక్టర్లు, అటవీ ,దే వాదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హిం చారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మా ట్లాడుతూ జిల్లాలో మాస్ ప్లాం టేషన్ కార్యక్రమాన్ని పక డ్బందీగా చేపట్టాలని , మున్సిపాలిటీలు, గ్రామపంచాయ తీ ల పరిధి లోని నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కలను వార్డులు , గ్రా మాల వారీగా నాటేలా కార్యాచరణ రూపొం దించాలన్నారు.మొక్కలు నాటడంతో పాటు, వాటిని సంర క్షించడం అత్యంత ముఖ్యమని, నాటిన ప్రతి మొక్క బ తికే లా అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని అన్నారు. అంతకుముందు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొం డ సురేఖ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకా శాలు ఉన్నందున మొక్కలు నాటేందుకు ఉన్న అను కూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు.

ఇందులో భాగంగా వన మహో త్సవం కింద ఈనెల 25 నుం డి ప్రారంభం కానున్న మాస్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టి సె ప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని, వన మహోత్సవం ద్వా రా అటవీ కవరేజీని మరింత పెంచేలా చర్యలు చేపట్టా లని, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను , మహిళా సంఘాలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు.

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేసి టీజీ ఫారెస్ట్ పో ర్ట ల్‌లో వివరాలను అప్‌లోడ్ చే యాలని, పట్టణ ప్రాంతాల్లో అట వీ విస్తీర్ణం తక్కువగా ఉన్నందు న అక్కడ ఎక్కువగా మొక్కలు నాటాలని, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతా ల్లో విస్తృతంగా పచ్చదనం పెంచాలని, ప్రతి ఇంటికి రెండు మొక్కలు అం దించేలా చర్యలు చేపట్టడంతో పాటు, దేవాల యాల్లో ప్రత్యేక మైన మొక్కలు నాటాలని అన్నా రు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలె క్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, సంబంధిత శాఖ ల అధికారులు హాజరయ్యారు.

Related Articles

Back to top button