Praja Deveena
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:49 pm Posted by : praja deveena

Nalgonda district collector chandrashekhar : నల్లగొండ కలెక్టర్ అప్పీల్, నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలి

 

Nalgonda district collector chandrashekhar:  ప్రజా దీవెన, నల్లగొండ: ఆహార భద్రత లో భాగంగా ప్రజలు ఆహార పదార్థాల కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ బి.చం ద్రశేఖ ర్ కోరారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కా ర్యా చరణ ప్రణాళికలో భాగంగా ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సోమవారం జిల్లా ఆహార భద్రత నియం త్ర ణ శాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జి ల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు “ఈట్ రైట్ స్టే హెల్తీ” పేరున ని ర్వహించిన నడక (walkathon) ను క్లాక్ టవర్ వద్ద జండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతిని ధులతో జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, దైనందిన జీవితం లో ఆహారంతో పాటు, వ్యాయా మం చాలా అవసరమని ,అలాగే ప్రజలు క ల్తీ ఆహారం బారినపడ కుండా ఆహార పదార్థాలు కొనే ముం దు జాగ్రత్తగా చూసి కొనుగో లు చేయాలని, నాణ్యతను, ఎ క్స్పైరీ డేట్ ను చూడాలని, ఎక్కడైనా ఆహార వస్తువులు క ల్తీ అయిన ట్లయితే తక్షణమే ఫిర్యాదు చేస్తే వెంటనే ఆహార భద్రత అధికారుల కు ఫోన్ చేస్తే ఆహార భద్రత అధికా రులు దాడులు నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటారని తెలి పారు.

ప్రభుత్వం తరఫున ప్రజల ఆరోగ్య సంరక్షణకై నల్గొండ ప ట్ట ణంలో సు మారు 100 మంది వీధి వ్యాపారులకు ఫుడ్ సేఫ్టీ శాఖ తరఫున లైసె న్సులు మంజూరు చేసినట్లు ఆయన తె లియజేయడమే కాకుండా వీధి వ్యాపారులకు లైసెన్స్ లు అందజేశారు. ఆహారం కల్తీ కావడం వ ల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజల ఆరోగ్య భ ద్రతను దృష్టిలో ఉంచుకొని కల్తీ లేకుండా ఆహార పదా ర్థా లు అమ్మాల్సిన అవసరం ఉందని వ్యాపారులకు సూచించా రు.

ప్రజలు, వ్యాపారులు అందరికీ అవగాహన కల్పించే నిమి త్తం రాష్ట్ర ప్ర భుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు “ఆరోగ్య వా రోత్సవం” నిర్వహిస్తున్నదని, అందులో భాగంగానే “ఈట్ రై ట్ స్టే హెల్తీ” నడక కార్యక్రమాన్ని నిర్వ హించడం జరిగింద ని, అలాగే ప్రజ లకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రచార వాహనాన్ని కూడా ఏర్పా టు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రచార వాహనం పది రోజులపా టు, జిల్లా వ్యాప్తంగా ప ర్యటించి ప్ర జలలో కల్తీ ఆహార వస్తువుల వల్ల జరిగే ప్రమా దాలు, కల్తీ ఆహార ప దార్థాలు కొనకుండా తీసుకోవాల్సి న ముందు జాగ్రత్త చర్యల పై వివ రిస్తుందని తెలిపా రు. ఆ హా ర భద్రత జోనల్ అధికారి జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శి వ శంకర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డి ఎంహెచ్వో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జి ల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ప్రధా న ఆసుపత్రి సూపరింటిండెంట్ నరసిం హారావు నేత, డాక్ట ర్లు, తదితరులు ఈ నడక కార్యక్రమంలో పాల్గొన్నారు.