Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 January 2026, 10:33 am Posted by : praja deveena

Nalgonda district collector : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీల్, ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకo

 

Nalgonda district collector :  ప్రజాదీవెన, నల్లగొండ: ఎ న్నికల విధులలో ప్రిసైడింగ్ అధికారుల పాత్రకీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ అన్నారు. శని వారం నల్గొండ జిల్లా కలెక్టర్ కా ర్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్ లో ము న్సిపల్ ఎన్నికల ప్రీసైడింగ్, స హాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎ న్నికల శి క్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడు తూ మున్సిపల్ ఎన్ని కలు పార్టీ ఆధారంగా జరుగుతాయ ని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పాటించిన విధంగానే అ న్ని నియమ, నిబంధనలు ఈ ఎన్ని కలలో సైతం వర్తిస్తాయ న్నారు.

ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూ షన్ కేంద్రంలో ఇచ్చే మె టీరియల్ ను పిఓలు జాగ్రత్తగా తనిఖీ చేసు కోవాలని ,బ్యా లెట్ బాక్స్ ల సీలిం గ్ ప్రక్రియను నియమ నిబంధనల ప్రకా రం అనుసరించి చేయాలని చెప్పారు. ప్రిసైడింగ్ అధికారుల డైరీని జాగ్రత్తగా రాయాలని ,రెండు కా పీలు సిద్ధం చేసుకో వాలని, బ్యా లెట్ పేపర్ ఎకౌంటు చెక్ చేసుకోవడంతో పాటు ఓటర్లు బ్యాలెట్ పే పర్ తీసుకున్న తర్వాత తప్పని సరిగా బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేస్తున్నది లేనిది గమనించేందుకు ఒ క ఏపీఓను నియమించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రంలోకి 5 గు రు ఓటర్లను మించి అనుమతిం చవద్దని, అంధులైన ఓటర్ల కు సంబంధించి అనుమతించే సహాయకులు తప్పనిస రి గా 18 సంవత్సరాలు నిండిన వా రై ఉండాలని, ఓటింగ్ కం పార్ట్మెంట్లో ఓటు వేసేందుకు ఇచ్చే మార్క్ తప్ప ఇతర ఏ వ స్తువులు ఉండకూడదని తెలిపా రు.ఎన్నికల ప్రక్రియను సిబ్బంది అందరూ సీరియస్ గా తీ సుకో వాలని, ఎ వరు తప్పులు చేయవద్దని, నిర్లక్ష్యంగా ఉం డవద్దని, ఒకవేళ ఎవరై నా తప్పు చేస్తే ఎన్నికల నియమ ని బంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చ రించారు.

మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధా ర ణ పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి సంచాలకులు జి. రమేష్ మాట్లాడుతూ పిఒ, ఏ పి ఓ లు ఎ న్నికల విధులను సక్రమంగా నిర్వ హిం చాలని, బ్యాలెట్ పేపర్ అకౌం ట్ ,పిఓ డైరీ అన్ని ఖచ్చితం గా, జాగ్రత్తగా తప్పులు లేకుండా పూరించాలని ,అలాగే వారి కి కేటాయించి న పోలింగ్ కేంద్రానికి సంబంధించిన బ్యా లెట్ పేపరే వచ్చింది లేనిది ఒకటికి రెండుసార్లు చూసుకోవాలని ఎన్నికల సామాగ్రిని సైతం తనిఖీ చేసుకోవాలని, ఎన్నికల వి ధుల్లో తేడా వస్తే పివోలు బాధ్యత వహించాల్సి ఉంటుం ద ని, ఇచ్చిన అన్ని ఫారమ్స్ పూర్తిగా నింపాలని తెలిపారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె . శ్రీని వాస్ పిఓలకు ,ఏపీఓ లకు సూచ నలు చేశారు. స్థానిక సంస్థల ఇం చార్జ్ అదనపు కలెక్టర్, నల్గొండ ఆ ర్డిఓ వై. అశోక్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ పిడి రాజకుమార్, డిఈఓ బి క్షపతి, మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.