Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 1:21 pm Posted by : praja deveena

Nalgonda district Court judgement : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కోర్టు సంచ లన తీర్పు, భార్యపై వేధింపుల కే సులో భర్తకు రెండు సంవత్సరాల జైలు శిక్ష

Nalgonda district Court judgement : ప్రజా దీవెన, న ల్లగొండ క్రైమ్: భార్యను వేధించిన కేసులో నిందితుడికి న్యా యస్థానం గట్టి హెచ్చరికగా నిలిచే తీర్పు వెలువరించింది న ల్గొండ ప్రత్యేక జె ఎఫ్‌సీఎం (ప్రొహిబిషన్ & ఎక్సైజ్ నేరాలు) కో ర్టు. నిందితు డికి మొత్తం రెండు సంవ త్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచల న తీర్పు వెలువరించింది. ఆ మేర కు కొట్టు తీర్పు వివరాలను నల్లగొండ జిల్లా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడిం చారు.

కేసు పూర్వపరాలు 2015లో నల్గొండ మహిళా పోలీస్ స్టేష న్‌లో నమోదు అయిన క్రైం నంబర్ 65/2015 కేసులో వ రంగల్ జిల్లా కొండకండ్ల మండలం రా మవరం గ్రామానికి చెందిన గిరగాని వేణు (43) అనే ప్రభుత్వ ఉపా ధ్యాయుడు తన భార్యను వేధించి నట్లు ఆరోపణలు నమోదయ్యా యి. ఈ కేసులో పోలీసులు సేకరిం చిన ఆధారాలతో కోర్టులో ఛా ర్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అ నంతరం నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.

కోర్టు తీర్పు శిక్షల వివరాల ఐపీసీ సెక్షన్ 498(A)కింద ఒక సంవత్సరం జైలు శిక్ష, డౌరి ప్రొహి బిషన్ చట్టం సెక్షన్ 4 కింద ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు రూ.5వేల జరిమానా వి ధిస్తూ జరిమానా చెల్లించకపోతే అదనం గా ఒక నెల సాధా రణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమల్లో ఉంటాయని కోర్టు పే ర్కొంది. ఈ కేసులో A2 నుంచి A5 వరకు ఉన్న ఇతర నిం ది తులను కోర్టు నిర్దోషులుగా విడు దల చేసింది.

ఈ క్రమంలో నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ భార్య లపై వేధింపులు లేదా కట్నం డిమాండ్లు చేయ డం వంటి కుటుంబ హింస చర్యలు చట్టపరంగా తీవ్రమైన నేరాలని స్పష్టం చేశారు. కు టుంబంలో మహిళలను గౌర వించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ యన పేర్కొన్నా రు. కుటుంబ సమస్యలు తలెత్తినప్పుడు హింసకు పా ల్పడకుం డా పరస్పర అవగాహ న తో పరిష్కరించుకోవాలని సూచిం చారు. భార్యపై వేధింపులు లేదా కట్నం డిమాండ్లు చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటు న్న మహిళలు భయపడ కుండా ముందుకు వచ్చి మహిళా పోలీస్ స్టేషన్ లేదా డయ ల్-100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. బాధితుల కు న్యాయం జరిగేలా పో లీసులు కట్టుబడి పనిచేస్తారని పే ర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ప్రాసిక్యూష న్ తరఫున ఏపీపీఓ ఎస్. మాధురి, అప్పటి ద ర్యాప్తు అధికారి సీఐ పి.సురేఖ, ప్రస్తుతం మహిళా పోలీ స్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కర్ణాకర్, సిడి ఓ రమేష్ బాబు, కోర్టు లైజ నింగ్ ఆఫీసర్లు నరేందర్, మల్లికార్జున లను జిల్లా ఎస్పీ అభి నందించారు.