Nalgonda district fetal road Accident : ప్రజా దీవెన చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఆదివారం తెల్లవారుజా మున ఒక భ యంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా లోని హైదరాబాద్ విజయవాడ జా తీయ రహదారిపై చి ట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోఒక ప్రైవేట్ ట్రా వెల్స్ బస్సు, కారు ఒక దానికొకటి అత్యంత వేగంగా ఢీకొ న్నాయి. ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న న లుగురు అక్కడికక్కడే మరణించగా, కారు డ్రైవర్ తీవ్ర గా యాలతో ప్రా ణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా డు. తెల్లవారు జా మున ముంచు కొచ్చిన మృత్యువుకు సంబం ధించి స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంఘ టన పూర్వపరాలిలా ఉన్నాయి.
తెల్లవారుజామున చీకటి ఇంకా విడకముందే ఈ ఘోరం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా దూ సుకొచ్చిన ప్రై వేట్ ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న కారును ముఖా ముఖిగా బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువ గా ఉందంటే, కారు ముందు భాగం పూర్తి గా నుజ్జునుజ్జయి బస్సు కిందకు దూసుకుపోయింది.
ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం
ప్రమాదం జరిగిన వెంటనేపెద్దశబ్దం రావడంతో స్థానిక గ్రామ స్థులు, హై వేపై వెళ్తున్న ఇతర వాహనదారు లు దిగ్భ్రాంతికి గురయ్యారు. వా రు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.
నలుగురు అక్కడికక్కడే మృతి
కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర రక్తస్రావమై, కారు తుక్కుగా మారిన ఇనుప భాగాల మధ్య ఇ రుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణా లు విడిచారు. కాగా కారు డ్రైవర్ తీవ్ర మైన గాయాలతో సీట్లోనే స్పృ హతప్పి పడి ఉండటాన్ని గ మనించిన స్థానికులు, ఎంతో శ్రమించి అ తడిని బయటకు తీశారు. సమా చారం అందుకున్న చిట్యాల పోలీసులు తక్ష ణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలతో పోరా డు తున్న కారు డ్రైవర్‌ను అత్యవ సర చికిత్స నిమిత్తం నల్గొం డ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థి తి అత్యంత విష మంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా పోలీసులు క్రేన్ స హాయంతో నుజ్జునుజ్జైన కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబ ద్ధీకరించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మా ర్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రాథమిక కార ణమని భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక ఓవ ర్‌టేక్ చేయ బోయి ఢీకొట్టారా? అనే కోణంలో చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు న్నారు. ముగ్గురు మృతు ల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

