Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda district police blockade : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లావ్యాప్తంగా పోలీసుల ‘నాఖా బందీ’, అల్లాడిపోయిన ఆకతాయిలు

Nalgonda district police blockade :  ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల ప రిర క్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ శనివారం అర్ధరాత్రి ఒక్కసారి గా ఉరుము లేని పిడుగులా విరుచుకు పడింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి నల్లగొం డ జిల్లా సరిహద్దులతో పాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా ‘నాఖా బందీ’ (ఆ కస్మిక వాహన తనిఖీలు) ని ర్వహించారు. ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయి లో పర్యటించి త నిఖీలను పర్యవే క్షించడంతో సిబ్బంది మరింత అప్ర మత్తం గా వ్యవహరించారు.

నల్లగొండ, మిర్యాలగూడ, దేవర కొండ సబ్ డివిజన్ల పరిధి లోని ప్రధాన పట్టణాలు, జాతీయ రహ దారులు, రద్దీ కూడ ళ్లతో పాటు అ నుమానాస్పద ప్రాంతాల్లో దాదాపు 1500 మంది పోలీసు అధికారు లు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చె క్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో యువకులు గుంపు లు గుంపులుగా తిరిగే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పె ట్టారు. అనుమా నాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల ను అ దుపులోకి తీసుకుని విచారిం చడంతో పాటు వారి పూర్వ పరాల ను రికార్డుల్లో నమోదు చేశారు. పాత నేరస్థులు, రౌ డీషీటర్ల కదలికల పై నిరంతర నిఘా ఉంచారు.

      260 వాహనాలపై చర్యలు

తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహ నాలు, కార్లు, ఆటోలను క్షు ణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రా లు, డ్రైవింగ్ లైసె న్సులు, నంబర్ ప్లేట్లను పరిశీలించారు. ముఖ్యంగా మందు బాబుల ఆటకట్టించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వ హించారు. హెల్మెట్ లేని ప్రయాణా లు, ట్రిపుల్ రైడింగ్, ర్యా ష్ డ్రైవింగ్, మోడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం కలిగిస్తు న్న వాహనాలు, నంబర్ ప్లేట్లు లేని మొత్తం 260 వా హనాల పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంత టి వారైనా ఉపేక్షించేది లేదని స్ప ష్టం చేశారు. ప్రజల భద్రతే పోలీస్ శా ఖ ప్రథమ ప్రాధాన్యత అంటూ నేరాల నియంత్రణ కోసం ఇ లాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొన సాగుతాయన్నా రు. ముఖ్యంగా యువత చట్టాలను గౌరవించా ల ని, రోడ్లపై స్టంట్లు చేస్తూ, సైలెన్సర్లు మార్చి అమాయక ప్రజలను భ యభ్రాంతులకు గురిచేస్తే వాహనా లను సీజ్ చేసి, కఠినమై న కేసులు నమోదు చేస్తాం. సమాజంలో శాం తిభద్రతల ప రిరక్షణ అందరి బా ధ్యత, ప్రజలు పోలీసులకు సహ కరించి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే అందిం చా లని అప్పీల్ చేశారు.

ఈ విస్తృత తనిఖీల కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీ ఐలు, ఎస్‌ ఐలు మరియు భారీ సంఖ్యలో పో లీసు సిబ్బంది పాల్గొన్నారు. పో లీసుల ఈ మెరుపు తనిఖీలతో జి ల్లావ్యా ప్తంగా అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తగా, సామా న్య ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ లో జరిగిన నాకా బందీ లో డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్, టూ టౌన్ సీఐ రా జశేఖర్ రెడ్డి, రాఘవ రావు, ఎస్సై లు సైదులు, సైదాబాబు ఇతర సిబ్బంది ఎస్పీ వెంట ఉన్నారు.

Related Articles

Back to top button