
Nalgonda double bedroom distribution : ప్రజా దీవె న, నల్లగొండ: పేదల చి రకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్ర భుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన న ల్గొండ పోలీస్ పరేడ్ మై దానంలో నిర్వహించిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న అనంతరం నల్లగొండ పట్టణంలోని గొ ల్లగూడ ప్రాంతంలో నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూం ఇండ్ల ను ప్రారంభించడమే కాకుండా, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. అంతేకాక అక్కడే ఏర్పాటుచేసిన సమావేశం లో లబ్ధిదారులందరికీ ఇంటి కేటాయింపు ఉత్తర్వులను పం పిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 552 మంది లబ్ధిదా రులకు ప్రతి కుటుంబానికి ఇంటి అవసరాల కోసం రూ.10 వేల చొప్పున తన సొంత నిధులతో ఆర్థిక సాయం అందిస్తా నని మంత్రి హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం అసంపూర్తిగా వ దిలివేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్లకు మరమ్మతులు చేయించి పేదలకు అందిస్తు న్నా మని మంత్రి తెలిపారు. ఇళ్లతో పా టు సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి కనెక్షన్లు వంటి మౌలిక వసతుల ను కూడా కల్పించామని చెప్పా రు.పేదలకు మేలు చేయాల నే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత వి ద్యుత్, రేషన్ కార్డుల వంటి పథకాలను అమలు చేస్తున్నద ని మంత్రి తెలిపారు.
నల్లగొండ గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 143 మం ది మైనార్టీలకు ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. తాను బ తికున్నంత కాలం ఆపదలో ఉన్న వారిని ఆ దుకుంటా నని, తనకు చేతనైనం తవరకు పేదలకు సహాయం చేస్తానని మంత్రి తెలిపారు.ఇళ్లు పొందిన లబ్ధిదారులు త్వరగా గృ హప్రవేశాలు చేసుకుని సొంతిం టిలో ఆనందంగా జీవించా లని కోరారు. గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదా యంలో రేషన్ షాపు, సూపర్ బజార్‌ప్రజలకు అందుబాటు లో ఉండే లా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.ఇండ్లు రాని అర్హులైన వారు తహసీల్దార్ కార్యాలయం లో దరఖా స్తు చేసుకోవాలని తెలిపారు.
నల్లగొండ పట్టణంలో ప్రతి వీధిలో సీసీ రోడ్లునిర్మిస్తున్నామని ,సుమారు రూ 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు పురోగతిలో ఉన్నాయని, మరో వెయ్యి కోట్లతో పట్టణంతోపా టు, చుట్టుపక్క ల, మొత్తం రూ.2 వేల కోట్లతో నల్లగొండ ప ట్టణాన్ని రోడ్లు, డ్రైన్లు, తాగునీటి పనులతో అభివృద్ధి చేయ నున్నామని, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను పూ ర్తి చేస్తామని వెల్లడించా రు. నల్ల గొండ కార్పొరేషన్ లో ఇండ్లురాని, అర్హులైన లబ్ధిదా రులకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చేందుకు తిప్పర్తి, ము నుగోడు రోడ్డు, మి ర్యాలగూడ రోడ్డు, దుప్పలపల్లి రోడ్డు, దే వరకొండ రోడ్డులలో స్థలాలను పరిశీలించడం జరిగిందని, అ ర్హులైన పేదలకు 75 గ జా ల స్థలం ఇచ్చి రూ.5 లక్షలతో ఇం దిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు మంత్రి తెలిపారు.
గత ఏడాది సు మారు 700 మంది లబ్ధిదారుల కు రూ.5 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇచ్చా మ ని చెప్పారు.నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ని ఎస్ ఎల్ బిసి వద్ద రూ.200 కోట్ల తో యంగ్ ఇండి యా ఇంటి గ్రేటెడ్ స్కూల్ నల్లగొండలో అ న్ని వర్గాల పిల్లలకు నా ణ్యమైన విద్య అందించేందుకు 2, 500 మంది విద్యార్థులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.
నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ 552 ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశాలు చేయించడం అభి నందనీయమని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల ని ర్మాణాన్ని పూర్తి చేయించారని తెలిపా రు.ఇంకా ఇళ్లు రాని అర్హుల కోసం నల్లగొండ నగరానికి నా లుగు వైపులా స్థలాలను పరిశీలి స్తున్నామని, మిగిలిన లబ్ధి దారులకు కూడా ఇళ్లు నిర్మించి అందిస్తామని చెప్పారు. ఎం పీ నిధుల తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నివాస ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏ ర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పే దల కలను సాకారం చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ దేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఈ ప్రాంతంలో 24 బ్లాకుల్లో 552 మంది లబ్ధిదారుల కు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి అం దిస్తున్నామని చెప్పారు. మొ త్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.36 కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు కలెక్ట ర్ తెలిపారు. ఇళ్లతో పాటు అవసర మైన మౌలిక వసతుల ను కల్పించి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చా మని పేర్కొన్నా రు. పేదల చిరకాల స్వప్నమైన సొంతింటిని స్వాతంత్ర్య దినోత్స వం రోజున అందించడం సంతో షంగా ఉందని, లబ్ధిదారులు ఇ ళ్లను సద్వినియోగం చేసుకోవాల ని అధికారులు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయ క్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ,డి ప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ ఆఫీస్ ఖాన్ , మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి ర మేష్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకి లాల్ రాజ్ కుమా ర్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ పరుశురాం, స్థా నిక కార్పొరేటర్ జ్ఞానే శ్వరి మాజీ జెడ్పిసి గుమ్మల మోహన్ రెడ్డి, గృహనిర్మాణ అధికారి డి వెంక టేశ్వ ర్లు, తదితరులు ఉన్నారు.








