Praja Deveena
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 3:13 pm Posted by : praja deveena

DRDA PD Shekhar Reddy : నల్లగొండ డిఆర్ డిఏ పీడీ శేఖర్ రె డ్డి హెచ్చరిక, ఉపాధి హామీ పను ల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

DRDA PD Shekhar Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల పట్ల సిబ్బంది నిర్ల క్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డి ఆర్ డి ఓ పిడీ వై.శేఖర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం శాలిగౌరారం మండల కేంద్రంలో నిర్వహించిన 15వ ప్రజా వేదిక కార్యక్ర మానికి హాజరై మాట్లాడారు. మండలంలో 24 గ్రా మపంచా యతీలో 15 రోజులు సామాజిక తనిఖీ బృందం ఇంటింటి తిరిగి ఉపాధి పనులను,కూలీలకు వేతనలను పరిశీలించా రు.

2024 -25 ఆర్థిక సంవత్సరంలో 445 పనులు జరుగగా కూ లిలకు మూడు కోట్ల 606 లక్షల ఒక వె య్యి పదిహేడు రూ పాయలు, సా మాగ్రికి 47 లక్షల 33 వేల 563 రూ పాయలు, మొత్తం నాలుగు కోట్ల ఏడు లక్షల 94 వేల ,580 రూపా య లు ఖర్చు చేసినట్లు తెలిపారు.చనిపోయిన మొక్కల ప్రదేశం లో కొత్త మొక్కలు నాటించాలని, అన్ని రకాల రిజిస్టర్లు అప్డే ట్ చేయాలని ఆదేశించారు.

24 గ్రామపంచాయతీలో అదనం గా పేమెంట్ చేసిన వాటిని రికవరీ చేసి ప్రభుత్వ ఖజానా జమ చేయాలని సూచిం చా రు. రెండు గ్రామా ల్లో కొంతమంది కూలీలకు వేతనాలు పూ ర్తిగా చెల్లించేంతవరకు జీతాలు నిలిపియాలని ఎంపీడీవో ను ఆదేశించారు. రికార్డులను సరిగా నిర్వహించని అధికా రులకు ఫైన్ వేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గార్ల పాటి జ్యోతిలక్ష్మి,డి.వి.ఓ వేణుగో పాల్, అమ్ముడ్స్ మాన్ ఎండి గౌరీ, ఎస్ ఆర్పి జె.శ్రీ కాంత్, ఏపీవో జంగ మ్మ, ఈసీ విశ్వనాథుల వెంకటాచారి, సర్పంచులు, టెక్నిక్ టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్య దర్శి లు ఫీల్డ్ అసిస్టెంట్లు డిఆర్పీలు తదితరులు పాల్గొన్నా రు.