Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 1:52 pm Posted by : praja deveena

Nalgonda DRDA Womens Day : డిఆర్ డిఏ జిల్లా మహిళా సమా ఖ్య ఆధ్వర్యంలో మహిళాదినోత్స వ వేడుకలు

Nalgonda DRDA Womens Day: ప్రజా దీవెన నల్లగొం డ: నల్లగొండ జి ల్లాలో మహిళల ఆత్మవిశ్వాసం, నాయక త్వంతో పాటు ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలిచే విధం గా శుక్రవారం జిల్లా డిఆర్డిఏ మహిళా సమాఖ్య ఆధ్వర్యం లో స్థానిక టీటీడీసీ ప్రాంగణంలోని జడ్ ఎస్ వద్ద అంతర్జా తీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించా రు. జిల్లా నలుమూలల నుంచి మహిళా సంఘాల ప్రతినిధు లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఉ త్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్థానిక సంస్థల అద నపు కలెక్టర్ శ్రీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా లోని స్వయం సహా యక సంఘాల (ఎస్ హెచ్జీ) మహి ళలు అన్ని రంగాలలో ముందుండి నాయకత్వాన్ని ప్రదర్శించా లని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థికాభి వృద్ధికి ప్రభుత్వం పలు వినూత్న అవకాశాలను కల్పిస్తున్నదని, ఉ దాహరణ కు పెట్రోల్ బంకులు, RT C బస్సులు, సౌర విద్యుత్ ప్లాంట్లు వంటి రంగాల్లో మహిళలు ముందు కు రావాలని ప్రోత్సహి స్తున్నదని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకా శాలను సద్వి నియోగం చేసుకుం టే ఆర్థికంగా మరింత బలపడతారని తెలిపారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధి కారి శేఖర్ రెడ్డి మాట్లాడు తూ మహిళా సంఘాలు ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ప్ర భుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని జిల్లా ను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని కోరారు. గ్రామ సంఘా ల భవనాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి SHG సభ్యులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహి స్తూ సంఘాలను మరింత బలోపే తం చేయాలని సూచించారు.ఈ వే డుకలు జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఆవుల మా ధవి అధ్యక్షతన నిర్వహించబడ్డా యి. కార్యక్రమంలో డి ఆర్ డి ఏ అదనపు పిడి ఎం. శ్రవణ్ కుమార్, డిపిఎం లు డి. మో హన్ రెడ్డి, రా మలింగయ్య, ఎస్. శ్రీనివాస్, సోమయ్య, జిల్లా సమాఖ్య కార్యదర్శి సరిత, కోశాధికారిసునిత పాల్గొన్నారు.

అదే విధంగా జిల్లాలోని అన్ని మం డలాల అధ్యక్షులు, ఓబి మహిళా సిబ్బంది (APMలు, CCలు, అకౌం టెంట్లు, ఆపరేట ర్లు), స్త్రీనిధి RM శ్రీలేఖ, మార్కెటింగ్ SRPలు, JR P లు, జి ల్లా సమాఖ్య మేనేజర్ అని త తో పాటు DRDA మహిళా సి బ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్య క్రమాన్ని విజయవంతం చేశారు.మహిళల శక్తి, సమైక్యత మరియు నాయకత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కొత్త ప్రేర ణను అందించాయి.