Praja Deveena
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 7:10 am Posted by : praja deveena

Nalgonda fetal Road Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్ఎంపి డాక్టర్ దుర్మరణం

Nalgonda fetal Road Accident : ప్రజా దీవెన నల్లగొం డ క్రైమ్: నల్ల గొండ జిల్లా కేంద్రం సమీపంలో తీవ్రవిషాదం నిం పిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఒక గ్రామీణ వైద్యుడు (RMP) రహదారిపై శవమై తేలడం స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. నల్లగొండ మండలం దోనకల్ గ్రామానికి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యుడు పు లేంధర్ (59) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యారు.

 

గుండ్లపల్లి కోళ్ల ఫారం సమీపంలో ఈ ఘోర ఘటన వెలుగు చూసింది. రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న పులేంధర్ మృతదేహాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్‌కు గుర య్యారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏదైనా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి, తొక్కేస్తూ వెళ్ళిపోయిందా,

బైక్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై స్కిడ్ అవ్వడం వల్ల ఈ ఘోరం జ రిగిందా ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. పో స్టుమార్టం నివేదిక, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు ఇది ప్రమాదమా లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.