Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 3:35 pm Posted by : praja deveena

Nalgonda hospital crime : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో మరో సంచలనఘటన, ప్రాణాలతో చెలగాటమాడుతోన్న ప్రైవేట్ ఆసుపత్రులు 

Nalgonda hospital crime : ప్రజా దీవెన, నల్లగొండ క్రై మ్: నల్లగొండ జిల్లాలో మరో విషాదకర సం ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ రైతు ప్రాణం కో ల్పోవడంతో కుటుంబ స భ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం పై మరోసారి తీవ్ర ప్రశ్నలు లేవనెత్తు తున్న ఘటనగా ఇది మారింది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాజపేట గ్రామానికి చెంది న రైతు దాసరి నాగయ్య మూడు రోజుల క్రితం జ్వరం కార ణంగా నల్లగొండ లోని పెరుమళ్ల ఆసుపత్రికి చికిత్స కోసం వ చ్చాడు. సాధారణ జ్వరం తో వచ్చిన నాగయ్య పరిస్థితి ఒ క్కసారిగా విషమించి, చివరకు ప్రా ణాలు కోల్పోయాడని కుటుంబ స భ్యులు చెబుతున్నారు.

సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. నాలుగు రోజుల పాటు ఆ సుపత్రిలో చికిత్స పేరుతో నాలుగు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారని నాగయ్య కుటుంబ సభ్యు లు ఆరోపిస్తున్నారు. మాకు చికిత్స చేయలేమని ముందే చెప్పి ఉంటే మేము వేరే ఆసుపత్రికి తీసుకెళ్లేవా ళ్లమని వారు క న్నీటి పర్యంతమయ్యారు.

నల్లగొండ అన్సారీ కాలనీలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెల కొం ది. ఆసుపత్రి ప్రాంగణంలో నాగయ్య కుటుంబ సభ్యుల రోద నలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. నాగయ్యకు ఇద్ద రు కుమార్తెలు, ఒక కుమారు డు ఉండగా, కుటుంబం దుః ఖంలో మునిగిపోయింది. నాగయ్య ఆరోగ్యం విషమించి న ప్పటికీ ఆసుపత్రి సిబ్బంది సరైన సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మా పేషెంట్‌ను చూపించండని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహ రించారని వారు అంటున్నారు.మరింత ఆశ్చర్యకర విష యం ఏమిటంటే, నాగయ్య ప్రాణాలు పోయిన తర్వాత కూ డా అతన్ని అంబులె న్స్‌ లో హైదరాబాద్‌కు తీసుకెళ్దామని చెప్పారని కుటుంబ సభ్యులు ఆ రోపిస్తున్నారు. అదే సం దర్భంలో నిజం బయటపడిందని వారు తెలిపారు.

ఇంకా తీవ్రఆరోపణగా నాగయ్య చెల్లెలుసరిత ఆసుపత్రి వైద్యులను ప్రశ్నించగా తనపై దాడి జరిగిందని ఆమె చెబు తోంది.ఈ ఘటనలో అ సలు నిజం ఏమిటి వైద్యుల నిర్ల క్ష్యం కారణమా లేదా బాధితుడి ఆరోగ్య పరిస్థితి చికిత్సకు సహక రించక ప్రాణాలు కోల్పోయాడా అన్న ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలాయి. ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఆ సుపత్రి నిర్వహణ మ రియు వైద్యులు చికిత్స విధానం పై పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇ లాంటి ఘటనలు జరు గుతున్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ స్పందన లేకపోవడంపై కూడా ప్రజలుఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండలో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం పై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.