Nalgonda kuchipudi dance Programs : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పుస్త కాల పురుగులుగా మారడమే కాదు చదువుతో పాటు చి న్నారుల మానసిక ఉల్లాసానికి క్రీడలు, సాం స్కృతిక నృత్యా లు కూడా అంతే ముఖ్యమని నల్గొండ చిన్నారులు నిరూపిం చారు. వేసవి సెలవులు దొరకడమే ఆలస్యం… టీవీలు, స్మా ర్ట్‌ఫోన్‌లకు పరిమితం కాకుం డా, సరికొత్త విషయాలు నేర్చు కుంటూ తమ విలువైన సమ యాన్ని అద్భుతంగా సద్విని యోగం చేసుకున్నారు. సోమ వారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో “నాట్య ది ఇ న్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ అకా డమీ” నిర్వహించిన ‘నా ట్య వేసవి శిక్షణా తరగతులు’ ఘ నంగా ముగిశాయి. ఈ ము గింపు వేడుకల్లో చిన్నారులు చే సిన నృత్య ప్రదర్శనలు చూ సేవారిని క ట్టి పడేశాయి. భార తీయ సంస్కృతికి ప్రతిబిం బాలైన భరతనాట్యం, కూచిపూడి నృత్యాలతో స్టేజ్ పై చి న్నా రులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్గొండ ని యోజకవర్గ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూ పాల్ రెడ్డి చిన్నారుల ప్రతిభను అ భినందించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ క్లాసికల్ డా న్స్, యోగాల విశిష్టతను వివరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూ చిపూడి శరీరా నికి మంచి వ్యాయామం ఇవ్వడ మే కాకుం డా, పిల్లల్లో ఆత్మవిశ్వా సం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచు తుంది. మన సంస్కృతీ సంప్రదా యాలపై అవగాహన కల్పి స్తుంద న్నారు.
అదే విధంగా భరతనాట్యం శరీర సమతుల్యతను, క్రమశి క్ష ణను అ లవరుస్తుంది. కండరాలను బలో పేతం చేస్తూ, మా నసిక ప్రశాంతత ను, సహనాన్ని ఇస్తుందని. చెప్పా రు. ఇక యోగ సాధన శారీరక ఆ రోగ్యంతో పాటు ఒత్తిడి, ఆందోళన లను దూరం చేస్తుందని, శ్వాస క్రి య మెరుగై రోజంతా ఉ త్సాహంగా ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. పిల్లల శారీ రక, మానసిక వికాసా నికి ఇటువంటి సాంస్కృతిక కళలు ఎంతో అవసరమని భూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక పట్టణ మాజీ కౌన్సిలర్ రావుల శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలను ఇటువంటి మంచి కార్య క్రమాల్లో ప్రోత్సహించడంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహణ కోసం బీఆర్ఎ స్ పార్టీ కార్యాలయాన్ని కేటాయించినందుకు ఆయన కృత జ్ఞతలు తెలిపారు. బీ ఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బో నగిరి దేవేందర్, డాక్టర్ పోలా వి ఠల్ బాబు, నాట్య కూచి పూడి అకాడమీ ఉపాధ్యాయులు కళ్యాణి శేఖర్, మాధవి, మేఘన, రవీంద్రచారి, ధామ నరేష్, అంజయ్య, రేణుక, సిం ధు, స్వాతి, స్వప్న, పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పా ల్గొన్నారు.


