Nalgonda Lawyers Celebrate : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయడం హర్షణీయమని బార్ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సె ల్ జిల్లా చైర్మన్ నాంపల్లి నరసింహ అన్నారు.
అడ్వకేట్స్ ప్రొ టెక్షన్ యాక్ట్ బి ల్లు క్యాబినెట్ లో ఆమోదం పొందిన సం ద ర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం కో ర్టు వద్ద సీఎం రేవంత్ రెడ్డి,రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షు డు పొన్నం అశో క్ గౌడ్ ప్లెక్సీ లకు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేయడం ద్వారా పరస్పరం శుభాకంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పది సంవత్స రాలుగా న్యాయవాదులు ఈ చట్టం అమలు కోసం పోరాడు తున్నామని గుర్తు చేశారు.ఎట్టకేలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అసెంబ్లీలో ఆమోదించి ఈ చట్టం అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రజల పక్షాన న్యాయం కోసం పని చేసే న్యాయవాదులకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని తె లిపారు. ఈ సం దర్భంగా ముక్తకం ఠంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తె లిపా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కన్వీ నర్ ఎండి అప్రోజ్ ఖాన్, న్యాయవాదు లు నేతి రఘు పతి, నాంపల్లి భా గ్య,సత్తయ్య, నాగిరెడ్డి, ప్రసన్న, లెనిన్ బాబు, శంకరయ్య, దుర్గాప్ర సాద్, ఆవుల ప్రేమ్ సుందర్ తదితరు లు పాల్గొన్నారు
