
Nalgonda Murder Case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ నగరంలో 2018లో సం చలనం సృష్టించిన ఓ హత్య కేసులో కా లంతో పాటు మరుగునపడినా, న్యాయవ్యవస్థ దాన్ని మరిచిపోక పోగా 2026లోన్యాయం తనగ మ్యాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివ రాల ప్రకా రం నల్లగొండ టూ టౌన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్ర ధాన నిందితుడు ఇప్పటికే మర ణించగా రెండో నిందితుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేకపో యాడన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మొ హమ్మద్ మొసిన్ ఖాన్ @ మొసిన్ (A1) మరణించగా (A2) నిందితు డు మొహ మ్మద్ దుర్వేశ్ మొహి యుద్దీన్ @ నయాబ్ పై కోర్టు కఠి న శిక్ష విధించింది. 2018 జనవరి 28వ తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో నల్లగొండ ప ట్టణంలోని భారత్ గ్యాస్ గోదాం స మీపంలోని ఓపెన్ ప్రదేశంలో కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకురి రమేష్ (30) ట్రాక్టర్ డ్రై వర్ ను నిందితులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో 29వ తేదీన మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. కుటుంబ సభ్యుల మధ్య ఉ న్న వ్యక్తిగత విభేదాలు, పాత గొడ వల కారణంగా ఈ హత్య జరిగిన ట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుల పైన 2 టౌన్ పోలీస్ స్టేష న్లో U/s 448, 323, 50 4, 506 R/w 302,201,153(A) R/w 34 IPC ప్రకారం కే సు నమోదు చేసి స రైన ఆధారాలు సేకరించి కోర్టులో సమ ర్పించగా నిందితునికి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధించ బడింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నె లల సాదా కారాగా ర శిక్ష అనుభవించవలసి ఉంటుం దని కోర్టు తన తీర్పులో వెల్లడిం చింది.
ఈ కేసులో నిందితునికి శిక్షపడే వి దంగా కృషి చేసిన ప్రాసి క్యూషన్ త రఫున అదనపు పబ్లిక్ ప్రాసి క్యూ టర్ గ్రేడ్-I ఆర్. అఖిల, అ ప్పటి దర్యాప్తు అధికారులుగా స బ్ ఇన్ స్పెక్టర్ డి. మధు, సీఐలు ఎన్. వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా ప్రస్తుతం డిఎస్పీ శివరాం రెడ్డి, న ల్లగొండ-II టౌన్ స ర్కిల్ సీఐగా ఎస్. రాఘవరావు, ఎస్.ఐ వై. సై దులు సిడిఓ సుమన్, కోర్టు లై జనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లి కార్జున్ ను జిల్లా ఎస్.పి అభినందిoచారు.



