Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda police Ganja Gang Arrested : బిగ్ బ్రేకింగ్, గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం, ఐదుగు రు అరెస్ట్ మరో నిందితుడు పరా రీ

--ఒరిస్సా నుంచి గంజాయి అక్రమ రవాణా బైక్ చోరీలతో దందా --2.5 కిలోల గంజాయి, 4 బైక్‌ లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం -- నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి

 

Nalgonda police Ganja Gang Arrested : ప్రజా దీవె న, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లాలో గంజాయిఅక్రమ ర వాణా, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చేపట్టి న చర్యలు మరోసారి ఫలించాయి. గంజాయి సరఫరాతో పాటు బైక్ చోరీలకు పా ల్పడుతున్న ముఠా గుట్టును నల్ల గొండ టూ టౌన్ పోలీసు లు రట్టు చేశారు. విశ్వసనీయ స మాచారం ఆధారంగా నల్లగొండ రైల్వే స్టేషన్ సమీపంలో గం జాయి పంచుకుంటున్న నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను అరెస్ట్ చే యగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తె లి పారు. వారి నుం చి సుమారు రూ.25 వేల విలువైన 2.5 కిలోల గంజాయిని, దొం గతనానికి గురైన నాలుగు మో టార్‌ సైకిళ్లు, ఐదు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.

ఒరిస్సా నుంచి గంజాయి.. నల్లగొండలో విక్రయాలు

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చి నట్లు తెలుస్తోంది. నిందితులు ఒరిస్సా నుంచి నల్లగొండకు గంజాయిని అక్రమంగా తరలించి, చిన్నచిన్న ప్యాకెట్లుగా త యారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో 20 గ్రాముల ప్యాకె ట్‌ను రూ.500కు విక్రయించినట్లు విచా రణలో వెల్లడైనట్లు తెలిపారు.గంజాయి కొనుగోలు కోసం డ బ్బులు సమకూర్చుకునేందుకు బైక్‌లను చోరీ చేసినట్లు పో లీసులు పేర్కొన్నారు. చోరీ చేసిన ఓ బైక్‌ను ఒరిస్సాలో కు దువ పెట్టినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.

  బైక్ చోరీలతోనూ సంబంధాలు

నిందితులు నల్లగొండలోని హను మాన్‌నగర్, గాంధీనగర్, కామేశ్వ ర్‌రావు కాలనీ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడి నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపు రంలోనూ దొంగతనా నికి పాల్పడినట్లు తెలిపారు. అరె స్ట యిన నిందితుల్లో పలువురిపై గతంలోనే గంజాయి, దొంగత నం, ఇతర కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మిషన్ పరివర్తన్’తో స్పెషల్ ఫోకస్

జిల్లాలో గంజాయి వినియోగాన్ని పూర్తిగా అరికట్టడమే ల క్ష్యంగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారిం చారు.‘మిషన్ పరివ ర్తన్’లో భా గంగా గంజాయి సేవించే వారిని గుర్తించి కౌన్సె లింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. యువత గం జాయి మత్తుకు బానిస కాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా నల్లగొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి కీలక హె చ్చరిక చేశారు. గంజాయి సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఎంతటి వ్యక్తి అయినా ఉపేక్షించబో మని స్పష్టం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో నల్లగొండను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే ప్రధాన లక్ష్యం అని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ కే. శివరాం రెడ్డి పర్యవేక్షణలో టూటౌన్ సీఐ కే. అది రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఎస్‌ఐలు డి. సైదాబాబు, అహ్మద్ షరీఫ్‌తో పాటు సి బ్బంది లావూరి బాలకోటి, మహమ్మద్ షకీల్ కీలకంగా వ్యవహరిం చారు. విజయవంతంగా ముఠాను పట్టుకున్న పోలీసు సి బ్బంది ని ఎస్పీ అభినందించారు.

Related Articles

Back to top button