
Nalgonda police Rescue Operation : ప్రజా దీవెన, న ల్లగొండ: అది నడిరాత్రి.. ఉడతలపల్లి గ్రామంలో ఒక్కసారి గా నిశ్శబ్దాన్ని చీల్చుతూ “డయల్-100” ఫోన్ మోగింది. భా ర్యాభర్త ల మధ్య తీవ్రగొడవ జరుగుతోందన్నది ఆ కాల్ సా రాంశం. కానీ, ఆ ఫోన్ కాల్ వెనుక ఒక ప్రాణం గాలిలో దీపం లా కొట్టు మిట్టాడుతోందని అప్పుడు ఎవరూ ఊహించలే దు. సమా చారం అందుకున్న మరుక్షణమే చండూరు పోలీ స్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆదిమూలం శ్రీనివాస్ అప్రమత్త మయ్యా రు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఘట నా స్థలానికి సైరన్ మోగిస్తూ ప రుగులు తీశారు. కేవలం 5 ని మిషాల్లో ఆ యన అక్కడకు చేరుకు నేసరికి పరిస్థితి ఆందో ళనకరంగా మారింది.లోపల ఒక వ్యక్తి ఇంట్లో ఉరివే సుకుని ప్రాణాపాయ స్థితిలో వే లాడుతున్నాడు. తలుపులు గడి య పెట్టి ఉన్నాయి. సెక న్లు కూడా గడుస్తున్న కొద్దీ ప్రాణం అనంత వాయువుల్లో కలి సిపోయే ప్రమాదం ఉంది.
సమయస్ఫూర్తితో ప్రాణదానం
పరిస్థితి తీవ్రతను క్షణాల్లో గ్రహిం చిన కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆలోచించడంలో సమయం వృథాచేయలేదు. ఒక్కసారిగా విరుచుకుపడి ఇంటి ప్రధాన ద్వారాన్ని పగులగొట్టి లోపలికి దూసుకెళ్లారు. ఉరితాడును తొలగించి, బాధితుడిని కిందకు దించారు.
దేవుడిలా సిపిఆర్ (CPR)
ఊపిరి అందక కొట్టుమిట్టాడుతు న్న ఆ వ్యక్తికి వెంటనే సమ యస్ఫూర్తితో CPR (ప్రాథమిక ప్రథమ చికిత్స)అందించారు. ఆ హృదయ స్పందనను మళ్ళీ జీవంపోసుకునేలా చేశా రు.అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని ఆసుపత్రికి తర లించి, మృత్యుముఖం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మెచ్చుకోళ్ళ జల్లు
పోలీస్ అంటే కేవలం చట్టాన్ని అ మలు చేయడమే కాదు.. ప్రా ణా లను కాపాడే దేవుడు” అని మ రోసారి నిరూపించిన హెడ్ కాని స్టేబుల్ శ్రీనివాస్ ధైర్యసాహసాలను, సమయా ను కూల స్పందన ను చూసి గ్రామీణులు, ఉన్నతా ధికారులు జోహార్లు అర్పిస్తున్నా రు.విపత్తు ఏదైనా, ఆపద ఎంత పెద్ద దైనా…”మేమున్నాం” అంటూ ప్రజారక్షణలో పోలీసులు ని రంతరం ముందుంటారని ఈ ఘటన చాటిచెప్పిందని చెప్ప వచ్చు.




