Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda prajavani division level : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ కీలకప్రకటన, ఇకపై ప్రతిసోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి

-- రేపటి నుంచే అధికారికంగా ప్రారంభం --డివిజన్ స్థాయి అధికారులు విధి గా తప్పనిసరిగా హాజరుకావాలి --జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్య క్రమానికి ఇది కొనసాగింపు --డివిజన్ పరిధిలోని ప్రజలు ఆర్డిఓ ఆఫీసుల్లో సంప్రదించాలి

Nalgonda prajavani division level : ప్రజా దీవెన, నల్ల గొండ: జిల్లాలో ఇకపై ప్రతి సోమవారం ఆర్ డిఓ కార్యాల యాలలోప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహించనున్నట్లు జి ల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్ర జావానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్ డిఓ లను ఆదేశిం చారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మా త్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతు న్నదని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమ వారం ఆర్డిఓ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉం టుందని స్పష్టం చేశారు.

డివిజన్ సాయి ప్రజావాణి కార్య క్ర మానికి రెవెన్యూ డివి జ నల్ అధి కారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపా రు.డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు అందరూ డి విజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆ దేశించారు.డివిజనల్ పంచాయతీ అధికారి, డిప్యూటీ డి ఎంహెచ్ ఓ, వ్యవసాయ సహాయ సంచాల కులు, డిస్కౌం డీఈలు,ఆర్ అండ్ బి,ఆర్ డబ్ల్యు ఎస్,హౌసింగ్ డిఈఈలు, సీడీపీవో లు,సహాయ ఎస్ సి,ఎస్ టి,బి సి అభివృద్ధి అధి కా రులు, డివిజన్ స్థాయి ప్రజా వా ణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు.

జిల్లా అధికారులందరూ వారి శాఖ కు సంబంధించిన అధి కారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పని సరిగా హాజర య్యేలా చూడాలని ఆదేశించారు. డివిజన్ స్థాయిలోని ర్వ హించే ప్రజవానికి వచ్చిన పిటిషన్లు అన్నింటిని ఆన్లైన్ చే యాలని, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని చెప్పారు. ఫి ర్యాదులన్నింటినీ సాధ్యమైన త్వరగా పరిష్కరించాలని ఆ దేశించారు.

Related Articles

Back to top button