
Nalgonda Rain Havoc : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: న ల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రకృతి ఒక్కసారి గా కన్నె ర్ర జేసింది. ఊహించని విధంగా విరుచుకుపడిన భారీ జడివాన, ఈ దురుగాలులు, వడగళ్ల వాన నల్లగొండ నగరాన్ని అల్లాడించాయి. గాలి దుమారానికి ఎక్కడికక్కడ భారీ వృక్షాలు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డా యి.దీంతో నగరమంతా చాలాసేపు చీకట్లోకి వెళ్ళిపోయిం ది.
కడపటి సమాచారం అందే సరికి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్ టీఓ ఆఫీస్ వెళ్లే దారిలో తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ ఉన్న ప్రై వేట్ ఆన్‌లైన్ సెంటర్ల పైకప్పు రేకులన్నీ తు ఫాన్ గాలికి కొట్టుకుపో యి రోడ్డుపై చెల్లాచెదురుగా పడి పో యాయి.అదృష్టవశాత్తూ గురు వారం సెలవు దినం కావడం వల్ల రోడ్డుపై జనసంచారం తక్కువగా ఉంది. లేదంటే ఊ హించని ప్రాణన ష్టం జరిగి ఉండేదని స్థానికులు ఊపిరి పీ ల్చుకున్నారు. అకాలవర్షంతో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతి న్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన నష్టపరిహా రం అందించి ఆదుకోవాలని షాపుల యజమానులు లబోది బోమంటున్నారు.
కారుచీకట్లో వృద్ధాశ్రమం
శాంతి మహిళా మండలి ప్రాంగ ణం ముందు ఉన్న ఒక భారీ వృక్షం గాలివానకు కుప్పకూలింది. అంధ కారంలో ఆశ్రమం చెట్టు కూలడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపో యిం ది. దీంతో వృద్ధాశ్రమం కారుచీకట్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆశ్రమంలో ఉన్నవారంతా వృ ద్ధులే కావడంతో ఈ వి పత్క ర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక భయాందోళన చెం దుతున్నారు.
అయ్యా, మా ఆశ్రమంలో అందరూ వృద్ధులే ఉన్నారు, కారు చీకట్లో అల్లాడిపోతున్నాం.. మమ్మల్ని ఆదు కోండి అంటూ ఆశ్రమనిర్వాహకు రాలు పిచ్చమ్మ కన్నీటిపర్యం తమ వుతు న్నారు. అయితే ఇంత పెద్ద విపత్తు సంభవించినా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆపదలో మేముంటాం” అని చెప్పే ‘ఆపదమిత్ర’ టీమ్స్ కానీ, ‘డిజాస్టర్ మేనేజ్మెంట్’ సిబ్బంది కానీ ఇంతవ రకు ఘటనా స్థలానికి చేరుకోలేద ని వాపోతున్నారు. నగరంలో ఎక్క డిక క్కడ తీగలు తెగిపడి, చెట్లు కూలిపోయి ప్రజలు ఆపదలో ఉం టే రెస్క్యూ టీమ్స్ ఎక్కడ పడుకు న్నాయంటూ బాధి తులు తీవ్ర ఆ వేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారు లు, విపత్తు నిర్వహణ బృందాలు రం గంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని నల్లగొండ ప్రజ లు కోరుతున్నారు.






