Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 3:23 pm Posted by : praja deveena

Nalgonda SaiKumar Murder Case busted : బిగ్ బ్రేకింగ్, మద్యంపార్టీ ఆపై న మ్మకద్రోహం, సాయికుమార్ హత్య కేసు గుట్టురట్టు 

Nalgonda SaiKumar Murder Case busted : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ కేశరాజుపల్లి శివారులో సంచలనం సృష్టించిన బోథ్ సాయి కుమార్ కిరాతక హత్య కేసును జి ల్లా పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. రూ. 30 వేల అప్పు వి వాదమే ఈ ఘోరానికి కారణమని తేల్చారు. అడిషనల్ ఎస్పీ జి. ర మేష్ మీడియాకు ఈ కేసు వివరా లను వెల్లడించారు. శుక్రవారం ఏ ర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

 మద్యం తాగించి..రాయితో కొట్టి..

ఈ హత్య కేసులో నిందితులు ఫూ ర్ఖాన్ @ మహేష్ (37), ఆరిఫ్ (26) (యూపీకి చెందిన చీరల వ్యాపారులు, ప్రస్తుతం బొట్టుగూడెం నివాసితులు) ముందస్తు ప్లాన్‌తో సాయికు మార్‌ను కేశరాజుపల్లి శివారులోని ఓవెంచర్‌కు పిలిపించా రు.అక్కడ సాయి కుమార్‌కు మద్యం తాపించారు. అతను మత్తులోకి జారుకోగానే సిమెంటు రాయితో తలపైకొట్టి, ము ఖం చిత్తుచిత్తుచేసి అతికిరాతకంగా అంతమొందించారు.

 

      నగదు, నగలతో పరార్

హత్య తర్వాత సాయి కుమార్ ఒంటిపై ఉన్న బంగారు ఆభ రణాలు, సెల్‌ఫోన్‌ను దోచుకుని నింది తులు విజయవాడకు పారిపోయా రు. విజయవాడలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు నింది తు లు ప్రయత్నిస్తుండగా నల్లగొండ పో లీసులు సాంకేతిక ఆధారాల (Technical Evidence) స హాయంతో వారిని వెంబడించి పట్టుకున్నారు.

ఇదిలా ఉండగా నిందితుల నుంచి బంగారు తాయెత్తు, బం గారు ముక్కుపుడక, బంగారు చెవికమ్మ మృతుడి సెల్‌ ఫో న్, పోలీసులకు అభినందనల జల్లు జిల్లా ఎస్పీ శ రత్ చంద్ర పవార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన 3 ప్రత్యేక బృందాలు డీ ఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో అత్యంత వేగంగా ఈకేసు ను ఛేదించాయి.కేవలం నలుగు రోజుల్లోనే నిందితులను ప ట్టుకున్న తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదాబాబు, ఏ ఎస్ఐ అఫ్జల్ మరియు పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినoదించారు.