
Nalgonda SCST special Court sensational judge ment ప్రజా దీవెన, నల్లగొండ: తప్పు చేస్తే కాలం వెంటాడు తుందనడానికి నల్లగొండ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వెలువరిం చిన తీర్పు నిదర్శనంగా ని లుస్తుంది. చట్టం శిక్షిస్తుందని ని రూపి స్తూ పదమూడేళ్ల క్రితం నాటి ఒక అమానుష ఘటన పై నల్లగొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ మంగళవారం కోర్టు సం చ లన తీర్పునిచ్చింది. ప్రేమ పేరుతో వంచించి, కులం పే రుతో దూషించిన నిందితులకు కోర్టు కఠిన కారాగార శిక్షల ను ఖరారు చేసింది.
కోర్టు తీర్పు అనుగుణంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ వెల్లడించిన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. 2013 లో చందంపేట మం డలం గన్నెర్లపల్లికి చెందిన నక్క ప ర్వ తాలు, డిండి మండలానికి చెం దిన ఓ యువతిని పెళ్లి చేసు కుంటానని నమ్మించి మోసం చేశాడు. తీరా బాధితురాలు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి, పర్వతాలు మరియు అతని అత్త నీలం సత్తమ్మ కలిసి ఆ మె కులాన్ని కించపరుస్తూ, తీవ్రంగా దూషించి పెళ్లికి నిరాకరించారు.
సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు నిందితులకు భారీ శిక్షల ను విధించింది. నిందితుడు A1 నక్క పర్వతాలుకు వేర్వేరు సెక్షన్ల కింద కలిపి మొత్తం 11 ఏళ్ల జైలు శిక్షతో పాటు మరి యు రూ.5వేలు జరిమానా విధించబడింది. అదే సమయం లో నిందితురాలు A2 నీలం సత్తమ్మకు 5 ఏళ్ల కఠిన కారా గార శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించారు. జరి మానా చెల్లించని పక్షంలో అదనంగా మరో రెండు నెలల జై లు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు కానున్నాయి.ఇదిలా ఉండగా బాధితురాలికి న్యా యం చేకూర్చడంలో కీలక పా త్ర పోషించిన స్పెష ల్ పబ్లిక్ ప్రాసి క్యూటర్ డి. నర సింహతో పాటు దర్యాప్తులో అప్పటి డిండి ఎస్సై ఎం. రా మాంజనేయులు, మాజీ దేవరకొండ ఎ స్ డిపిఓ కె. మనోహ ర్, హెడ్ కానిస్టేబుల్ కె. కృష్ణన్, కాని స్టేబుల్ పి.లింగయ్య బా ధితు లకు భరోసా ఇచ్చేలా, నేరస్తు ల్లో వణుకు పుట్టించేలా ఈతీర్పు ఉంది.
సాక్ష్యాధారాలను పకడ్బందీగా సమర్పించిన ప్రతి అధికారి కి ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందన లు తెలిపారు. ప్రస్తు తం డిండి పోలీస్ స్టేషన్ బాధ్యతలను SHO బాల కృష్ణ, CI కె. బీసన్న మరియు దేవ రకొండ SDPO ఎం.వి. శ్రీనివాస్ ప ర్యవేక్షిస్తున్న వారికి కూడా అభినoదనలు తెలిపారు. కాగా కాలం గడిచినా న్యాయం గెలుస్తుందని, బలహీన వర్గాలపై వేధింపులకు పాల్ప డితే శిక్ష తప్పదని ఈ తీర్పు మరో సారి స్పష్టం చేసిందని పేర్కొన్నారు.




