
Nalgonda sensational murder case : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని నిశ్శబ్ద కాల నీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు దశాబ్దాల బంధం మ ద్యం మత్తులో జరిగిన చిన్నపాటి ఘర్షణ చివరికి ఒకరి ప్రా ణంతీసే వరకు వెళ్ళింది. 70 ఏళ్ల వృద్ధుడిని, అతనితో 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న 60 ఏళ్ల మహిళే హతమా ర్చ డం స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
సంఘటన పూర్వాపరాలు ఇలా ఉ న్నాయి. అనంతరామా రం గ్రామా నికి చెందిన ఆవుల మల్లయ్య (70), లక్ష్మమ్మ (6 0) గత 20 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. అయితే, గత కొంత కాలంగా వీరి మధ్య విభేదా లు భగ్గుమంటున్నాయి. గొడ వ లు పడలేక మల్లయ్య శాంతినగర్ వదిలి శ్రీరాంనగర్‌లో ఒం టరిగా అద్దెకు ఉంటున్నాడు. అయితే ఘటన జరిగిన సంద ర్భంలో ఇద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్ర మంలో మళ్ళీ పాత గొడవలు మొదలయ్యాయి.
మాట మాట పెరిగి పరస్పరం దూ షించుకున్నారు.ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో లక్ష్మమ్మ కర్రతో మల్లయ్యపై విచక్ష ణారహితంగా దాడి చేసింది. దెబ్బలకు తాళలేక పడిపో యి న మల్లయ్య మెడను గట్టిగా బిగించడంతో ఆయన అక్క డి కక్కడే ప్రాణాలు విడిచారు.జీవిత చరమాంకంలో ప్రశాం తం గా ఉండాల్సిన వయసులో, ఇలాంటి హింసాత్మక ఘటన జ రగడం అత్యంత దురదృష్టకరంగా స్థానికులు ఆవేదన వ్య క్తం చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే నల్లగొండ టూ టౌన్ ఎస్సై సైదులు తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లక్ష్మమ్మను పోలీ సులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు. మృతదేహాన్ని జిల్లా ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించా రు.హత్యకు గల పూర్తి కారణాలపై పో లీసులు ఆరా తీస్తు న్నారు. వృద్ధా ప్యంలో చోటుచేసుకున్న ఈ ‘క్రైమ్ స్టోరీ’ ఇ ప్పుడు నల్లగొండలో హాట్ టాపిక్ కావడం విశేషం.




