Praja Deveena
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 3:21 pm Posted by : praja deveena

Nalgonda Sexual Assault pocso Case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లాలో కీచకపర్వం కలకలం,మతిస్థిమితం లేని బాలికపై దారుణ లైంగికదాడి 

Nalgonda Sexual Assault pocso Case : ప్రజా దీవెన, నల్లగొం డ: సమాజం ఎటు వెళ్తోంది? టెక్నాలజీ మారు తోం ది, కాలం మారుతోంది.. కానీ కొందరి వికృత బుద్ధులు మా త్రం మార డం లేదు అనడానికి నిద ర్శనంగా నిలిచే ఒక అత్యంత దా రుణమైన ఘటన ఇప్పుడు న ల్గొండ జిల్లాలో వెలుగులోకి వ చ్చింది.నమ్మకంగా ఉండాల్సిన సమాజం లో.. ఒక మైనర్ బాలి క పై జరిగిన అన్యాయం వింటే గుండె తరుక్కుపోతుం ది. అనుముల మండలం కుపాసిపల్లి గ్రా మంలో చోటుచేసు కున్న ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకివెళ్తే..

కుపాసిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు, అలాగే పీ ఏపల్లి గ్రామానికి చెందిన మరో యువ కుడు కలిసి.. ఒక మై నర్ బాలిక పై కొంతకాలంగా వరుసగా లైంగిక దాడికి పాల్ప డుతూ వచ్చారు. అయితే, ఆ నిస్సహాయురాలైన బాలిక గ ర్భం దాల్చడంతో ఈ పాపం పండింది, వికృత చేష్టలు కా స్తా బయటపడ్డాయి.న్యాయం కో సం ఆ బాలిక ధైర్యంగా పోలీ స్ స్టేషన్ మెట్లెక్కింది. దీనిపై హాలి యా పోలీసులు తక్షణమే స్పందించారు.

 

యాక్షన్ మోడ్‌లోకి పోలీసులు: నిందితులపై ఉచ్చు

ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. నిందితులపై ఉక్కుపాదం మోపారు.బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నిందితులు ఆదిమల్ల అజయ్, బండారు అఖిల్, మరియు వీరికి సహకరించినట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న పేర్ల రవణమ్మ అనే ముగ్గురిపై కేసు నమోదు చే శారు.కొత్తగా అమలు లోకి వచ్చిన భారతీయ న్యాయ సం హిత (BNS) తో పాటు, కఠిన మైన పోక్సో (POCSO) చ ట్టం, అత్యాచారం కేసుల కింద సెక్షన్లు నమోదు చేశారు.

ప్రస్తుతం నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అదుపు లోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గా లింపు చర్యలు ముమ్మరం చేశారు.ప్రస్తుతం బాధిత బాలిక ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేవలం శారీరక పరీక్షలే కాదు నల్గొండలోని ‘భరోసా సెంటర్’ ద్వారా ఆ బాలికకు అండగా నిలి చేందుకు సైకాలజిస్టులు, లీగల్ టీ మ్ రంగంలోకి దిగింది. ఆమెకు అవసరమైన వైద్య, మానసి క మరియు న్యాయ సహాయాన్ని అందిస్తున్నారు.

శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తూ, నిందితులకు కోర్టు ద్వారా ఉరి తాడు పడేంత కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు స్పష్టం చే స్తున్నారు. ఇలాంటి మృగాలకు సమాజంలో తిరిగే అర్హత లేదు. వీరికి పడే శిక్ష.. భవిష్యత్తులో ఇ లాంటి తప్పు చేయాలనుకునే ఇంకెవరికైనా ఒళ్ళు గగుర్పొడి చేలా ఉండా లన్న అభిప్రాయం సర్వత్రా వెళ్ళడవుతోంది.