
Nalgonda Social media missus : ప్రజా దీవెన నల్ల గొండ క్రైమ్: నిజాలు రాసే కలాలపై నిందల దాడి ఎ క్కు వైంది. ప్రజా సమస్యలు, అవి నీతిపై గళమెత్తే జర్నలి స్టు లను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కు ట్రలపై నల్లగొం డ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అసలైన పాత్రికేయులను ‘నకిలీలు’గా చిత్రీకరిస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న ముఠాల ఆటక ట్టించాలని డిమాండ్ చేస్తూ శనివారం జర్నలిస్టులు భారీ ఎ త్తున తరలివెళ్లి డీఎస్పీ శివరాం రెడ్డికి వినతిపత్రం సమర్పిం చారు.
‘జనoసాక్షి’ దినపత్రిక నల్లగొండ బ్యూరో ప్రతినిధి ఓడపల్లి మధుపై కొద్దిరోజులుగా జరుగుతున్న నిరా ధార, అసత్య ప్రచారాలను జర్నలి స్టు సంఘాలు తీవ్రంగా ఖండించా యి. పాత్రికేయుల విశ్వసనీయ త ను, మనోధైర్యాన్ని దెబ్బతీ సేందుకు జరుగుతున్న కుట్రలను ఎంత మాత్రం సహించేది లేదని హెచ్చరిం చారు.మీడియా స్వేచ్ఛ ముఖ్యం ఫోర్త్ ఎస్టే ట్‌పై జరుగుతున్న ఈడిజిటల్ దాడుల నుంచి మీడియా స్వే చ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల భద్రతకు తగిన చర్యలు తీ సుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ డీఎస్పీ సీరియస్ యాక్షన్
జర్నలిస్టుల ఆవేదనపై డీఎస్పీ శివరాం రెడ్డి తక్షణమే సా నుకూలంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా జర్న లిస్టుల ప్రతి ష్టకు భంగం కలిగిస్తున్న నిందితులను వెంటనే గుర్తించి, చట్టపర మై న చర్యలు తీసుకోవాలని వన్‌టౌన్ సీ ఐ ఎమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావుల ను డీఎస్పీ ఆదేశించారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షిం చేది లేదని స్పష్టం చేశారు.
వినతిపత్రం సమర్పించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులకు మద్ద తుగా నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు, టి యుడబ్ల్యూజే గుండగోని జయశంకర్ గౌడ్, నాయకులు గాదె రమేష్, మల్లికార్జున్ యాదవ్, యాదగిరి, స లీం, అల్లిమల్లికార్జున్, దండంపల్లి రవి, వెంకట మధు, కు షాల్ చారి, శంకర్, హరి, సుధాకర్, ఎండీ కలీ మ్ ఖాన్, నవీ న్, సైదులు, శివ, సూర్య, సాగర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



