
Nalgonda SP road accident : ప్రజా దీవెన గుర్రంపోడు: నల్లగొండ జిల్లాలో ఈ సాయంత్రం పొద్దు పో యిన తర్వాత జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదా న్ని నింపింది. గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారు లో అతివేగం ప్రాణాలను బలితీసు కుంది. ఈ ఘటనలో ఇ ద్దరు బైక్ ప్రయాణికులతో పాటు, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా మృతి చెందారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం నల్లగొండలో జరిగిన ఒ క కార్యక్రమానికి హాజరై తిరిగి దేవ రకొండ వైపు వెళ్తున్న కియా సెల్టోస్ కారు (TS 05 FP 2277), వద్దిరె డ్డి గూడెం శివారుకు చేరుకోగానే అ దుపు తప్పింది. కారు డ్రై వర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడంతో, అటు గా మల్లేపల్లి వైపు నుండి వస్తున్న స్ప్లెండర్ మోటార్ సైకిల్ (TS 05 EV 2192)ను వేగం గా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రత ఎంత ఉందంటే బైక్‌పై ప్రయాణిస్తున్న న ర్సింగ్ ధనుంజయ, నర్సింగ్ మధుబాబు సంఘటనా స్థ లం లోనే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరె డ్డి బాల్ రెడ్డి కూడా తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మర ణించాడు.
క్షతగాత్రులకు చికిత్స.. రంగంలోకి ఎస్పీ
ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరెడ్డి అలివేలు, మా లె వెంకటమ్మ మరియు మాలె మంజుల తీవ్రంగా గాయప డ్డారు. స్థానికుల స మాచారంతో స్పందించిన అధికా రులు వెంటనే వారిని చికిత్స నిమి త్తం తరలించారు. ఘటనా స్థ లాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించా రు. ప్రమాదం జరిగిన తీరును, పరి స్థితులను అడిగి తెలుసుకున్న ఎ స్పీ, ఘటనపై కేసు నమోదు చేసి లో తైన విచారణ చేపట్టాలని ఎస్. ఐ వెంకన్నను ఆదేశించారు.
మృ తుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నా యి.ప్రయాణాల్లో అతివేగం ఎంతటి ప్ర మాదాలకు దారితీ స్తుం దో ఈ ఘట న మరోసారి హెచ్చరించింది. ఈ మేరకు గుర్రం పోడు పోలీసులు కే సు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారం భించారు.





