
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవె న, పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్న గూడెం స్టేజ్ సమీపంలో జరిగిన ఒక ఘోర రహదారి ప్రమా దం నల్లగొండ జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమా దంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరోముగ్గురు తీవ్ర గా యాలతో ఆసు పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఘటన తీవ్రతను పరిగణన లోకి తీసుకున్న జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ప్ర మాద స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ప్ర మాదం జరిగిన తీరు ను, వాహనాల ధ్వంసమైన స్థితిని ఎ స్పీ నిశితంగా పరిశీలించారు. ర హదారి మలుపులు, లైటిం గ్ వ్యవస్థ, ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లేదా మానవ తప్పిదాలపై స్థానిక అధికారులతో చర్చించారు.
ఈ ప్రమాదానికి గల ప్రతి చిన్న కా రణాన్ని క్షుణ్ణంగా పరిశీ లించాలి. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిం చాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు.ఈ దుర్ఘట నలో ప్రాణాలు కోల్పో యిన వారి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు. కాకర్ల థామస్య (51),ప్రకాష్ రావు (35) లు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కాకర్లపాలెం గ్రా మస్తులుగా, సాయి కుమార్ (20) వరంగల్ వాస్తవ్యు లుగా గుర్తించగా గాయపడిన ము గ్గురిని వెంటనే నాగార్జునసాగ ర్ ఏ రియా ఆస్పత్రికి తరలించారు. వా రికి అత్యుత్తమ, మె రుగైన వైద్యం అందేలా చూడాలని ఎస్పీ అధికారులను ఆదే శించారు. అలాగే మృ తుల కుటుంబాలకు తన ప్రగాఢ సా నుభూతిని తెలియజేశారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో వాహన దారుల నిర్లక్ష్యంపై ఎస్పీ శరత్ చం ద్ర పవార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైవేలపై ప్రయాణించేట ప్పుడు ప్రాణాలను పణంగా పెట్ట వద్దని హె చ్చరించారు. స్పీడ్ లిమి ట్స్ దాటి ప్రయాణించడం వల్లే ని యంత్రణ కోల్పోతున్నారని,రక్షణ కవచాలు తప్పనిసరి సీట్ బెల్ట్ ధ రించకపోవడం, హెల్మెట్ లేకపోవడం మరణాల రేటు ను పెంచుతోందని విచారం వ్యక్తం చేశారు.

మద్యం మత్తులో ప్రయాణాలొద్దు
డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల మీ ప్రాణాలకే కాదు, రోడ్డుపై వెళ్లే ఇ తరుల ప్రాణాలకు కూడా ముప్పేనని, మలుపులు, జాతీయ రహదారులపై ఓ వర్‌టేక్ చేసేటప్పుడు క్షణకాలం నిగ్రహం పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవం తం చేశారు. టెక్నికల్ టీమ్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్ ఆధా రంగా ప్రమాదానికి గల పూర్తి కారణాలను త్వరలోనే వెల్లడి స్తామని ఎస్పీ పేర్కొన్నారు.




