Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda SP Sharath Chandra Pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలక వ్యాఖ్య, డ్రగ్స్‌కు నోచెప్పండి,జీవి తానికియస్ చెప్పండి 

Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: అంతర్జా తీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరి యు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నషా ముక్త్ అభియాన్ లో భాగం గా మహాత్మాగాంధీ యూ నివర్సి టీలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక అవగా హన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జి ల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై వి ద్యార్థులు,యువతను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తి గత ఆ రోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజ శాంతి భద్రతల కు,యువత భవిష్యత్తుకూ తీవ్రమైన ము ప్పు అని పేర్కొన్నారు. నేటి సమాజంలో ముఖ్యంగా విద్యా ర్థులు,యువతను లక్ష్యంగా చేసుకు ని మాదక ద్రవ్యాల వి నియోగాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు జరు గు తు లన్న నేపథ్యంలో అప్రమత్తత చాలా అవసరం అని చెప్పారు.

 

మాదక ద్రవ్యాల బారిన పడిన యువత విద్య, వృత్తి, కు టుంబ బంధాలు, ఆరోగ్యం అన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఉందని ఎస్పీ గారు హెచ్చరించారు. “డ్రగ్స్ అల వాటు కాదు –అది జీవితాన్ని నా శనం చేసే ప్రమాదకరమైన వ్యస నం” అని పేర్కొంటూ, యువత త మ లక్ష్యాలపై దృష్టి పెట్టి చెడు అల వాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.

ప్రత్యేకంగా విద్యార్థుల్లో అవగాహ న పెంపు అత్యవసరం అ ని పేర్కొ న్న ఆయన,మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక దుష్ప్రభావాలు,డ్రగ్స్‌కు అలవా టు పడితే ఎదురయ్యే చట్ట పరమైన పరిణామాలు,కుటుం బ సభ్యులు, స్నేహితులు గమనించా ల్సిన ముందస్తు హె చ్చరిక సంకేతా లు, వంటి అంశాలపై విద్యార్థులకు అవగా హన కల్పించారు.

 

“మత్తు పదార్థాలకు బానిసైతే భవి ష్యత్తు చీకటిమయం అవుతుంది. డ్రగ్స్‌కు దూరం – కుటుంబానికి ఆ నందం, సమాజానికి భద్రత” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత మా దక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంలో ముందుండాలని, తమ స్నేహితుల ను కూడా ఈ దుష్ప్రవర్తన నుంచి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

అలాగే విద్యార్థులు, యువత ఎవ రైనా మాదక ద్రవ్యాల విక్ర యం, ర వాణా, వినియోగానికి ప్రోత్సహిం చడం, అను మానాస్పద వ్యక్తులు విద్యాసంస్థల పరిసరాల్లో తిరగడం వంటి విషయాలు గమనించిన వెం టనే 8712670266 గా ని పోలీ సులకు సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో డ్రగ్ ఫ్రీ వాతావరణం ఏర్పడాలంటే సమా చా రం ఇవ్వడంలో ముందుకు రావాలని అన్నారు.

ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థులు “డ్రగ్స్‌కు నో – ఆరోగ్య కరమైన జీవితానికి యస్”, “మా దక ద్రవ్యాల రహిత సమాజ నిర్మా ణానికి మనందరం భాగస్వాము లు కావాలి” అనే సందేశాన్ని స్వీక రించారు. కార్యక్రమంలో పా ల్గొన్న విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటా మ ని, తమ స్నేహి తులు, కుటుంబ సభ్యుల్లోనూ అవగా హ న కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సి టీ రిజిస్ట్రార్ అంజి రెడ్డి,ఎస్బి సీఐ ఆదిరెడ్డి, నార్కట్ పల్లి సీఐ సురే ష్, ఎస్.ఐ విష్ణు, అధ్యాపకులు , విద్యార్థులు పా ల్గొన్నారు.

 

ఏఆర్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

నల్లగొండ క్రైమ్: నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో విధులు ని ర్వహిస్తున్న 10 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టే బు ళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీ సు కార్యాలయంలో జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన సిబ్బం దికి హెడ్ కానిస్టేబుల్ పట్టీలు అందజే సి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి అనేది కేవ లం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూ డా మరింత పెరిగినట్లేనని అన్నారు. ఇప్పటి వరకు చూపిన క్రమశి క్షణ, అంకితభావం, సేవాతత్పర తను ఇదే విధంగా కొనసాగిస్తూ కొత్త హోదాలో మరింత సమర్థవంతంగా విధు లు నిర్వర్తించాలని సూచించారు.

పోలీసు శాఖలో ప్రతి ఒక్కరి కృషి ప్రజల భద్రత, శాంతిభద్ర తల పరిర క్షణలో ఎంతో ముఖ్యమని ఎస్పీ పే ర్కొన్నారు. ప్రజలకు మరింత చే రువగా ఉంటూ, బాధ్యతాయుతం గా, నిజాయితీతో, సేవా భావంతో పని చేయాలని పదోన్నతి పొందిన సిబ్బందికి సూచించారు. శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా తమ పని తీరుతో ఆదర్శంగా నిలవాలని ఆ కాం క్షించారు.ఈ కార్యక్రమంలో ఏ. ఆర్ డీఎస్పీ శ్రీనివాసులు , ఆర్.ఐ సంతోష్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button