
Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవె న, నల్లగొండ: సాయం త్రం వేళ, నల్గొండ సాగర్ రోడ్డులోని తెలంగాణ కాలనీలో ఉన్న ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ, ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ లోపలి నుండి వస్తున్న తీవ్రమైన దు ర్వాసన చుట్టుపక్కల వారిని ఉలిక్కిపడేలా చేసింది. సమా చారం అందుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టిలో పలికి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి వణికిపో యారు. కుళ్ళిపోయిన స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు కనబడడంతో క్షణాల్లో పోలీసులు రంగంలోకి దిగారని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ర్ వెల్లడించారు. డీఎస్పీ కె. శివరాంరెడ్డి నేతృత్వంలో 7 ప్ర త్యేక బృం దాలు, 3 సీఐలు, 7ఎస్సైల సైన్యం గుట్టు విప్ప డానికి వేట ప్రారంభిం చిందని, సిసిటివి కెమెరాలు, టెక్నాల జీ సాయంతో కేవలం 3 రోజుల్లోనే ఈ నరమేధం వెనుక ఉ న్న ఆ నలుగురు కిరాతకులను నార్కట్ పల్లి ఫ్లైఓవర్ వద్ద కాపు కాసి నొ క్కి పట్టారని వివరించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జి ల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితు లను ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు.
హత్యకు గురైన హసీనా ఆదిత్య స్కూల్‌లో ప్రైవేట్ టీచర్. ఆమె భ ర్త సుల్తాన్, పిల్లలు ముజమ్మిల్ (2 0), అఫ్కూరా (12) లతో కలిసి హ్యాపీగా జీవిస్తున్నారు. అయితే, హసీనా అక్క కూతురు తబస్సుం, ఆమె భర్త సయ్యద్ అస్లాం (టాక్సీ డ్రైవర్) లీనమైన విలాసవంతమై న జీవితం, అప్పుల ఊబి వారి కం టికి కునుకు లేకుండా చేశాయి. గ తంలో ఓకేసులో తబస్సుం తల్లి జై లుకు వెళ్లడానికి హసీనానే కారణ మనే పాత పగ ఒకవైపు.. అస్లాం అడిగి న కొత్త అప్పు ఇవ్వకుం డా పాతబాకీ తీర్చమంటూ హసీనా అవమానించిందనే కోపం మరో వైపు వారిలో పగను పెంచాయి. ఇంట్లో బోలె డంత డబ్బు, బంగారం ఉందని హసీనా సొంత కుమార్తె బు ష్రా ద్వారా వీరికి ఉప్పందింది.
యూట్యూబ్‌లో ‘హత్య’ పాఠాలు
ఫిబ్రవరిలో ఒకసారి హసీనా ఇంట్లో దొంగతనానికి ప్రయత్నిం చి విఫల మైన అస్లాం.. ఈసారి ఎలాగైనా ఆమెను అంత మొందించి ఐశ్వర్యం సంపాదించాలనుకున్నాడు. ఇందుకో సం అతడు ఆశ్రయించింది సోషల్ మీడియాను. హత్య చేసి దొరకకుండా ఉండటం ఎలా శవా లు ఎన్ని రోజులకు కుళ్లి పోతాయి?, పోలీసుల కళ్ళు ఎలా కప్పాలి? అంటూ యూ ట్యూబ్‌లో పక్కాగా సెర్చ్ చేసి ‘మర్డర్ స్కెచ్’ గీశాడు.పథకం ప్రకారం జూన్ 19 రాత్రి హైదరాబాద్ నుండి మహీంద్రా మ రాజో కారులో, చేతిలో ‘జ మ్మి కత్తి’తో నల్గొండకు వచ్చాడు అస్లాం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాంపౌండ్ గోడ దూకి ఇంట్లో నక్కాడు.
తెల్లవారుజామున 5 గంటలకు తలుపు తీసి బయటకు వ చ్చిన హసీనా మెడపై కత్తితో నరికేశాడు. రెండో వేటుగా కేక లు విని కాపాడ టా నికి వచ్చిన భర్త సుల్తాన్‌ను క్షణాల్లో లే పేసాడు. అదే సమయంలో మూడో వేటుగా నిద్రలేచి భ యంతో పరుగెడుతున్న కొడుకు ముజమ్మిల్ ఎదురుతిరిగి ఐరన్ రా డ్‌తో అస్లాంపై దాడి చేసినా, కిరాతకుడు అతడిని నరికి చంపాడు. ఈ పెను గులాటలోనే అస్లాం చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. బెడ్‌రూమ్‌లో మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల చిన్నారి అఫ్కూరా తనను చూసేసిందని, సాక్ష్యం ఉంచకూడదని ఆ పాపను బయటకు లాగి గొంతు కోసి చం పేశాడు.నలుగురి ప్రాణాలు తీ శాక బీరువాలోని 5 తులాల బం గారం, ల్యాండ్, బ్యాంక్ డాక్యుమెం ట్లు దోచుకున్నాడు. ఎవరికీ అను మానం రాకుండా శవాలపై చాపలు, దుప్పట్లు కప్పి, ఇంటికి తాళం వేసి కారులో చెక్కేసాడు.
బంగారం కరిగించారు, కానీ పాపంపండింది
హైదరాబాద్ కు చేరిన అస్లాం తన స్నేహితుడు సోహైల్ (A-3) సహా యంతో దిల్ షుక్ నగర్‌లోని శ్రీ బా లాజీ జ్యువెలర్స్ యజమాని హే మంత్ కుమార్ (A-4) వద్ద ఆ రక్తం అంటిన బంగారాన్ని కరిగించి తాక ట్టు పెట్టాడు. అందుకు ప్రతిఫలం గా రూ. 5.30 లక్షలు తీసుకుని జ ల్సాలు చేస్తుండగా, న ల్గొండ ఖాకీ లు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి బే డీలు వేశారు. ఇదిలా ఉండగా నిం దితు ల నుండి రూ. 3,04, 000 న గదుతో పాటు ఐదు తులాల కరి గించిన బంగారపు ముద్ద, మహేం ద్ర మజారో కారు (TS -07- UH-9 197), హత్యకు ఉపయోగించిన జ మ్మికత్తి,3 సె ల్ ఫోన్లు, ల్యాండ్ & బ్యాంక్ పత్రాలు, రక్తపు మరకల బ ట్ట లు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.
పోలీస్ బాస్‌ల ‘సింగం’ వేట, రివార్డుల పంట
ఈ అంధకార కేసును కేవలం 3 రో జుల్లోనే ఛేదించి, నింది తులను కటకటాల్లోకి నెట్టిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, ఇన్స్పె క్టర్లు రాజశేఖర్ రె డ్డి, రాఘవరావు, చంద్రశేఖర్ రెడ్డి, జితేంద ర్ రెడ్డి, ఎస్సైలు శివప్రసా ద్, సైదాబాబు, వీరబాబులతో పా టు సీసీఎస్ బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యే కంగా అ భినందించి, నగదు రివార్డులను ప్రకటించారు.కాగా Cr.No. 161/ 2026 U/s 103(1) BNS (భారతీయ న్యా య సంహిత) కింద నల్గొండ I టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.






