Praja Deveena
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 2:30 pm Posted by : praja deveena

nalgonda sp sharath chandra pawar : హెల్మెట్ ప్రాముఖ్యతపై మీడియా సభ్యులకు అవగాహన  

nalgonda sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడి యా సభ్యులకు హెల్మెట్ ప్రాముఖ్య తపై ప్రత్యేకంగా అవగాహన కల్పిం చారు.ద్విచక్ర వాహనాలు నడిపే ప్ర తి ఒక్కరు తమ ప్రాణ భద్రత కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించా లన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గా యాలు మరియు ప్రాణనష్టం తగ్గిం చడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషి స్తుందని తెలిపారు.మీడియా స మాజంలో ముఖ్యమైన పాత్ర పోషి స్తుందని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో మీ డియా మిత్రులు ముందుండాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

ముఖ్యంగా హెల్మెట్ వినియోగం గు రించి ప్రజలకు సరైన సమాచారం చేరవేసి, ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించే అలవా టు ఏర్పడేలా అవ గా హన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలిపారు. అ నంతరం, శాంతలక్ష్మి ఫౌం డషన్ కం బాలపల్లి ఉపేందర్, మన్నెం యాద గిరి గార్ల సహ కారంతో రోడ్డు భద్రత ను ప్రోత్సహించే భాగంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా మీడియా స భ్యులకు హెల్మెట్లు పంపిణీ చే యడం జరిగింది.

ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ విని యోగంపై ప్రజల్లో మరిం త చైత న్యం పెంపొందుతుందని అధికారు లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రె డ్డి, ఎస్బి సీఐ రాము,వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య,ఉమెన్స్ పోలిస్ స్టేషన్ సీఐ కరుణాకర్,ఇతర పోలీస్ అ ధి కారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.