
Nalgonda SP Sharath Chandra Pawar warning : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నల్ల గొండ జిల్లాలో రబీ ధాన్యం కొనుగో లు ప్రక్రియను వేగవంతం చేయడం తో పాటు రైతు లకు ఎలాంటి ఇ బ్బందులు కలగకుండా చూడటానికి నల్గొం డ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎ స్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం మి ర్యాల గూడ పరిధిలోని వసుంధర, ఆర్. ఎస్.వి,అనంత సా యి,పారాబాయిల్డ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ప్రభుత్వ కొను గోలు కేంద్రా ల నుండి వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మొద టి ప్రాధాన్యతతో అన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మి ల్ పాయింట్‌కు వచ్చిన ప్రతి లా రీని 12 గంటల లోపు అన్లో డ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపే లా చర్యలు తీసు కోవాలని ఆదేశిం చారు.ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియలో ఎ లాం టి జాప్యం, నిర్లక్ష్యం లేదా రై తులకు ఇబ్బందులు కలిగించే పరి స్థితులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరఫున ప్రతి మిల్ పాయింట్ వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను ఏర్పా టు చేసిన ట్లు తెలిపారు.
నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల సంద ర్భంగా కొంతమంది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్ల ర్లు, మధ్యవర్తులు రై తులను మోసం చేస్తున్నట్లు పోలీస్ శా ఖ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఎ స్పీ తెలిపారు. రైతుల కష్టార్జిత ధా న్యంపై ఎలాంటి అక్రమాలు, దోపి డీలు, బెదిరింపులు జ రిగినా సహించబోమని స్పష్టం చేశారు.కొన్ని కొనుగోలు కేం ద్రాల్లో “తాలు” పేరు తో ఒక్కో ధాన్య బస్తాకు రెండు నుంచి మూడు కిలోల వరకు అధిక తూకం వేస్తూ రైతులను నష్టప రుస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.
అదేవిధంగా మిల్లులకు ధాన్యం చేరుకున్న తర్వాత బస్తా కొ ద్దీ కటిం గ్‌లు వేయడం, నాణ్యత పేరుతో రైతులపై అనవ సర ఒత్తిడి తీసుకు రావడం, “ఏ గ్రేడ్ ధాన్యాo అని ని ర్ధారిం చి ట్రక్ సీట్ రాసి మిల్లుకు పంపించిన తర్వాత మిల్లర్లు బి గ్రే డ్ కింద దిగుమతి చేసుకుంటా మ ని రైతులను ఇబ్బంది పె డుతూ క్వింటాల్‌కు రూ.20 వరకు తగ్గించి చెల్లింపులు చే యడం వంటి అక్ర మాలు చోటు చేసుకుంటున్నాయని తెలి పారు.
ఇది చాలదన్నట్లు కొంతమంది లా రీ యజమానులు, హమా లీలు బ స్తాకు అదనంగా రూ.2 చెల్లిస్తేనే ధాన్యం లోడ్ చేస్తా మని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొ న్నారు. రైతుల బలహీన పరిస్థితిని ఆసరాగా చేసుకుని డ బ్బులు డిమాండ్ చేయడం, బల వంతపు వసూళ్లకు పాల్ప డడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ధాన్యం కొనుగో లు ప్రక్రియలో పాల్గొనే ప్రతి అధికారి, కొనుగోలు కేంద్రాల ని ర్వాహకులు, మిల్లర్లు, ర వాణాదారులు ప్రభుత్వ నిబంధ న లను కచ్చితంగా పాటించాలని సూచించారు. రైతుల నుం డి ఎ లాంటి అక్రమ వసూళ్లు చేసినా, అధిక తూకం వేయిం చినా, కటిం గ్‌లు పెట్టినా, చెల్లింపుల్లో మోసాలకు పాల్పడి నా సంబంధిత వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్ప ష్టం చేశారు.
అలాగే రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధా న్యానికి ప్రాధాన్యత ఇవ్వ కుండా ప్రైవేట్ ధాన్యాన్ని ముందుగా దించుకుంటే లేదా రైతులను ఇబ్బం దులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్య లు తీసుకుంటామని హె చ్చరించారు.రానున్న పది రోజుల పాటు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చే సేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామని, ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా ధాన్యం రాకుండా చెక్ పోస్టుల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని తెలి పారు.
రైతులు ఎవరైనా ధాన్యం కొనుగోళ్ల లో అక్రమాలు, అదనపు వసూళ్లు, బెదిరింపులు, మోసాలకు గురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లే దా డయల్-100 కు సమాచారం ఇవ్వా లని జిల్లా ఎస్పీ సూచించా రు. అదేవిధంగా ప్రభుత్వ ధా న్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవ కతవకలు జరగ కుండా రెవెన్యూ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో స మన్వయం చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేపడుతు న్న ట్లు చెప్పారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధి కారులకు ధాన్యం కొను గోలు కేంద్రా లు,రైస్ మిల్లులపై ప్ర త్యేక నిఘా ఉంచాలని ఆ దేశాలు జారీ చేసిన ట్లు తెలిపారు.ప్రభుత్వ ధాన్యం కొ ను గోలు ప్రక్రియ సజావుగా సాగేం దుకు పోలీస్ శాఖ పూర్తి స్థా యిలో సహకారం అందిస్తుందని జిల్లా ఎ స్పీ ఈ సందర్భం గా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, ఎస్బి సీఐ ఆదిరెడ్డి,రూరల్ సిఐ పి.ఎన్.డి ప్ర సాద్,రూరల్ ఎస్.ఐ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.






